సన్ని లియోన్ కమిటైన రెండో సినిమా డిటేల్స్
ఇక ఆ చిత్రం మరేదో కాదు గత ఏడాది బాలీవుడ్‌లో విడుదలై సంచలన విజయం సాధించిన 'రాగిణి ఎంఎంఎస్'కి సీక్వెల్. ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు రాబట్టుకొంది. నిర్మాణ వ్యయం కంటే దాదాపు తొమ్మిది రెట్లు అధికంగా వసూళ్లను సాధించింది. బాలాజీ మోషన్ పిక్చర్స్‌పై జితేంద్ర, శోభాకపూర్ నిర్మించారు. తాజాగా 'రాగిణి ఎంఎంఎస్'కి కొనసాగింపును రూపొందించబోతున్నారు. రెండో భాగంలో ప్రధాన పాత్రకు సన్నీ లియోన్‌ని ఎంపిక చేసుకొన్నారు. సన్నిలియోన్ ని ఎంపిక చేసుకోవటంతో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
జిస్మ్ 2 విషయానికి వస్తే ...పూజా భట్ నిర్మాణ సారధ్యంలో రూపొందనున్న ఆ చిత్రం ఓ క్రైమ్ ధ్రిల్లర్ అని చెప్తున్నారు. ఈ చిత్రంలో సన్నిలియోన్ ని తీసుకోవటంతో ప్రాజెక్టు హాట్ గా మారింది. ట్రేడ్ లో ఓ రేంజి బిజినెస్ జరగనున్నట్లు సమాచారం. సన్ని లియోన్ ని ఆ సినిమా పూర్తయ్యే దాకా వేరే సినిమాలోకి తీసుకోకూడదని ఎగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది. అందుకే ఆమె వర్మ సినిమాలోకి రాలేదు. మరే హిందీ చిత్రమూ కమిట్ కాలేక పోయింది.
ఇక సన్ని లియోన్ ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ...తన పేరెంట్స్ పంజాబ్ కి చెందిన వారే నని తాను ఇండియాకు చెందిన దాన్ని అనే అంది. తాను ఫోర్న్ ఇండస్ట్రీలోకి కావాలని వెళ్లలేదని,కానీ డబ్బు సంపాదించటానకి అదో మంచి మార్గం అని తెలిసాక వెళ్లకుండా ఉండలేకపోయాను అంది. మొదట తన తల్లితండ్రులు వ్యతిరేకించారు కానీ తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోమని తనను దగ్గరకు తీసుకున్నారని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తాను జిస్మ్ 2 లో నటిస్తున్నానని, ఆ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. అలాగే బిపాసా బసు నటించిన జిస్మ్ చిత్రం చూసానని,ఆ పాత్రను ఆకళింపు చేసుకుని మరీ ఈ సీక్వెల్ లో చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇక జిస్మ్ 2 చిత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని,ఏ మాత్రం తేడా వచ్చినా ఆమె ఫోర్న్ స్టార్ కావటంతో సెన్సార్ వద్ద పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫెరఫెక్ట్ గా వారిని ఎదుర్కోవటానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












