ఆ రకమైన వర్కౌట్స్ చేయండి.. ఆరోగ్యంగా ఉండండి: సన్నీలియోన్
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జనమంతా ఇంటి గడపదాటి బయటకు రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సంపూర్ణంగా పాటిస్తూ ప్రభుత్వ చర్యలకు సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఖాళీ సమయాన్ని తాను ఎలా ఉపయోగిస్తున్నానో తెలుపుతూ ప్రేక్షకులకు కొన్ని సూచనలిచ్చింది సన్నీలియోన్.
కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా మార్కెట్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, జిమ్‌లు అన్నీ మూతపడటంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ పరిస్థితిలో సెలబ్రిటీలు ఇంట్లోనే ఉంటూ ఫిట్ నెస్ కోసం అధిక సమయం కేటాయిస్తున్నారు. ఇదేబాటలో సన్నీ లియోన్ కూడా ఇంట్లో వ్యాయామాలు చేస్తూ భర్త, పిల్లలతో సమయం గడుపుతోంది.

ఈ లాక్ డౌన్ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉండటానికి పలు సూచనలు చేసింది సన్నీలియోన్. జంక్ ఫుడ్స్ తక్కువగా తినండని, ఆరోగ్యకరమైన చిరుతిండికి ప్రాధాన్యత ఇవ్వండని ఆమె చెప్పింది. మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోండి అని చెబుతూ రోజంతా చిన్నచిన్న వర్కౌట్స్ చేయండని సన్నీ అంటోంది. ఇదే కాకుండా శారీరకంగా కష్టపడి పనిచేసే ఇంటి పనులపై కూడా శ్రద్ధ చూపితే ఆరోగ్యంగా ఉండొచ్చని పేర్కొంటూ సన్నీలియోన్ పలు సూచనలిచ్చింది.
మరోవైపు దేశవిదేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9 లక్షల మంది కరోనా బారిన పడగా, 43 వేలకు పైగా మరణాలు నమోదు కావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.


Click it and Unblock the Notifications











