»   » షాకింగ్: కరణ్ జోహార్ సినిమాలో సన్నీ లియోన్

షాకింగ్: కరణ్ జోహార్ సినిమాలో సన్నీ లియోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ త్వరలో ‘యే దిల్ హై ముష్కిల్' అనే సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ ముఖ్య పాత్రల్లో నటించబోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ కూడా అతిథి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మాజీ పోర్న్ స్టార్ కావడంతో తొలి నాళ్లలో సన్నీ లియోన్ తో సినిమాలు చేయడానికి చాలా మంది ప్రముఖ ఫిల్మ్ మేకర్స్ వెనకాడే వారు. దీంతో తొలి నాళ్లలో ఆమె చిన్న చిన్న బేనర్లో, బి గ్రేడ్ ఫిల్మ్ మేకర్స్, యార్టర్స్ తో మాత్రమే నటించింది. అయితే సన్నీ లియోన్ ఉన్న సినిమాలకు మంచి ఆదరణ ఉండటంతో ఇపుడు ఏ గ్రేడ్ ఫిల్మ్ మేకర్స్, యాక్టర్స్ కూడా ఆమెను తమ సినిమాల్లో తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఎలాగైనా బాలీవుడ్లో ఎదగాలనుకున్న సన్నీ లియోన్ కల క్రమక్రమంగా నిజమవుతోంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తాజా సినిమా ‘సింగ్ ఈజ్ బ్లింగ్' సినిమాలో కూడా ఆమె స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తోంది. తాజాగా కరణ్ జోహార్ లాంటి స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ‘యే దిల్ హై ముష్కిల్' సినిమాలో కూడా అవకాశం దక్కించుకోవడం గమనార్హం. ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ.

ఇంటర్నెట్లో టాప్ ప్రేక్షకులు అత్యధికంగా వెతికే బాలీవుడ్ స్టార్లలో సన్నీ లియోన్ టాప్ పొజిసన్లో ఉంది. గూగుల్ లాంటి సంస్థలు ప్రకటించి జాబితాల్లో ఆమె పేరు టాప్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె సినిమాలో ఉండటం వల్ల ప్లస్సవుతుందని పలువురు ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నారు.

సన్నీ లియోన్ నటిస్తున్న మెయిన్ సినిమాల వివరాల్లోకి వెళితే... ఆమె త్వరలో అడల్ట్ కామెడీ మూవీ ‘మస్తీజాదే' ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఆమె తుషార్ కపూర్ కు జోడీగా నటిస్తోంది. మిలప్ జవేరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అక్షయ్ కుమార్ మూవీ ‘సింగ్ ఈజ్ బ్లింగ్'.... కరణ్ జోహార్ దర్శకత్వంలో రాబోతున్న ‘యే దిల్ హై ముష్కిల్' సినిమాలు మంచి విజయం సాధిస్తే, సన్నీ లియోన్ పాత్రకు మంచి గుర్తింపు వస్తే ఇకపై బాలీవుడ్ టాప్ స్టార్ల సినిమాలన్నింటిలోనూ సన్నీ లియోన్ ఉండటం ఖాయం.

1977లో విడుదలైన ‘దూస్రా ఆద్మీ' చిత్రానికి రీమేక్ గా ‘యే దిల్ హై ముష్కిల్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2016 దివాళి నాటికి విడుదల చేయాలనే ప్రణాళికలతో ముందుకు సాగుతోంది ఆ చిత్ర టీం. ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ లాంటి స్టార్లతో పాటు సన్నీ లియోన్ కూడా ఉండటం వల్ల మంచిరెస్పాన్స్ వస్తుందని దర్శకుడు కరణ్ జోహార్ భావిస్తున్నారు.

ప్రెట్టీ ఫ్లవర్
  

ప్రెట్టీ ఫ్లవర్

ఫ్లవరీ క్రాప్ టాప్ డిజైన్ డ్రెస్సులో సన్నీ లియోన్. ఈ డ్రెస్సును తానియా కనుజా డిజైన్ చేసారు.

ఆల్ కలర్‌ఫుల్
  

ఆల్ కలర్‌ఫుల్

లీలా మూవీలో మహరాష్ట్రీయన్ లుక్ లో సన్నీ లియోన్.

ఒంపు సొంపులు
  

ఒంపు సొంపులు

చిట్టి పొట్టి డ్రెస్సులో తన ఒంపు సొంపులు ప్రదర్శిస్తున్న సన్నీ లియోన్.

లేడీ ఇన్ బ్లాక్
  

లేడీ ఇన్ బ్లాక్

తన నటిస్తున్న ఓ సినిమా సెట్లో బ్లాక్ డ్రెస్సులో సన్నీ లియోన్ ఇలా...

సన్నీ లియోన్
  

సన్నీ లియోన్

డిజైనర్ సోనాక్షి రాజ్ డిజైన్ చేసిన డ్రెస్సులో సన్నీ లియోన్.

ది చిక్ లుక్
  

ది చిక్ లుక్

మోడ్రన్ స్కర్ట్ ధరించి చిక్ లుక్ లో సన్నీ లియోన్.

బీచ్ ఒడ్డున
  

బీచ్ ఒడ్డున

సన్నీ లియోన్ కు బీచ్ ఒడ్డున గడపటం అంటే ఎంతో ఇష్టం.

Please Wait while comments are loading...