»   » నిజమే..! తల్లి కావాలనుకుంటున్న సన్నీ లియోన్

నిజమే..! తల్లి కావాలనుకుంటున్న సన్నీ లియోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మీరు విన్నది నిజమే! అడల్ట్ స్టార్ సన్నీ లియోన్ తల్లి కావాలనుకుంటోంది. సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్ త్వరలో ఓ బిడ్డను కనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. సన్నీ లియోన్ అత్తగారు ఇప్పటికే ఈ విషయమై ఆమెను అడిగారట. అయితే ప్రస్తుతం సన్నీ లియోన్ బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీ అవడం వల్ల వీలు కావడం లేదట. త్వరలో మంచి సమయం చూసి ప్లాన్ చేసుకుంటాం అంటున్నారు ఈ జంట. తల్లయితే సన్నీ లియోన్ సినిమాలు దూరం కాక తప్పదు. అలా అయితే ఆమె ఫ్యాన్స్ పరిస్థితి ఏమోటో పాపం?

లీవుడ్లో అడుగు పెట్టక ముందు సన్నీ లియోన్ పోర్న్ సినిమాల హీరోయిన్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి వచ్చిన తర్వాత ఆమెను చాలా మంది వ్యతిరేకించారు. బాలీవుడ్లో సక్సెస్ ఫుల్ గా వరుస అవకాశాలతో దూసుకెలుతున్న ఆమెను ఇప్పటికీ కొందరు విమర్శిస్తూనే ఉన్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సన్నీ లియోన్ స్పందిస్తూ...‘పోర్న్ సినిమాల వల్లనే నేను ఈ స్థాయికి ఎదిగాను. నాకంటూ ఒక గుర్తింపును తెచ్చాయి. నేను పోర్న్ స్టార్ ను కావడం వల్లనే బాలీవుడ్లో ఇంత పాపులారిటీ వచ్చింది. సెక్స్ సినిమాల బ్యాగ్రౌండ్ నాకు లేకుంటే నాకు ఇక్కడ అవకాశాలు వచ్చేవే కాదు' అని తెలిపారు.

Sunny Leone Wants To Have A Baby

‘కొందరు నన్ను ఈ విషయంలో విమర్శించినా, నన్ను చీప్ అంటూ మాట్లాడినా నేనేమీ పట్టించుకోను. నా గత జీవితం గురించి నేనేమీ చితించడం లేదు. పోర్న్ ఇండస్ట్రీలో నేను ఒక భాగం అయినందుకు, ఆ రంగంలో రాణించినందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. నేను ఇండియాలో సెటిల్ అవుతానో? లేదో? నాకు తెలియదు. నేను, నా భర్త ఈ విషయం గురించి ఇప్పటికీ ఆలోచిస్తున్నాము' అని తెలిపారు.

తనను ఇండియా నుండి వెళ్లిపోవాలని విమర్శిస్తున్న వారి గురించి మాట్లాడటానికి సన్నీ లియోన్ నిరాకరించింది. బాలీవుడ్లో సక్సెస్ అయిన తర్వాత సన్నీ లియోన్ పోర్న్ సినిమాల్లో నటించడం లేదు. సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబర్ కూడా పోర్న్ సినిమా స్టారే. ప్రస్తుతం వీరు ఆ సినిమాల్లో నటించక పోయినా.... పోర్న్ సినిమాల నిర్మాణాన్ని మాత్రం కొనసాగిస్తున్నారు.

సన్నీ లియోన్ నటించిన ‘మస్తీ జాదె' బాలీవుడ్ మూవీ జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇదొక సెక్స్ కామెడీ మూవీ. సినిమాలో వల్గర్ సీన్లు, సెక్స్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ సమస్యలు ఎదుర్కొంటోంది.

English summary
Bollywood star Sunny Leone is planning to become a mother very soon. From a long time, Sunny and her husband Daniel Weber have been planning on having a baby but due to star’s busy hectic schedule, they couldn’t find the right time to start a family.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu