బూతు సినిమాలకు బ్రేక్ వేసిన హాట్ లేడీ!
పెద్దలకు మాత్రమే పరిమితం అయిన పరమ బూతుకు ఫోర్న్ సినిమాల హీరోయిన్ సన్నీ లియోన్ కొంత కాలం ఆ సినిమాలకు బ్రేక్ వేసింది. 'జిస్మ్ 2' చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ భామ...ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరో సంవత్సరం పాటు ఫోర్న్ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టానని చెప్పింది.
జిస్మ్ 2 చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగు పెట్టడం ఆనందంగా ఉందని, ఇక్కడి ప్రేక్షకులు తనను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. బాలీవుడ్లో తనకు ఆఫర్లు వస్తున్నాయని, అందు కోసం కనీసం సంవత్సరమైనా పూర్తిగా బిటౌన్ పైనే గురి పెట్టాలనుకున్నట్లు స్పష్టం చేసింది.
ఫోర్న్ స్టార్ ఇమేజ్ వదిలించుకోవడం అంత సులభం కాదు, నాకు అలాంటి ఉద్దేశ్యం కూడా లేదు. అయితే మంచి చిత్రాల్లో, గుడ్ పెర్ఫార్మెన్స్ కనబరిచి పేరు తెచ్చుకోవడమే నా లక్ష్యం. బాలీవుడ్ తన లక్ష్యానికి సరిగా సరిపోతుందని భావిస్తున్నాను. ఇక్కడ రాణించగలననే నమ్మకం ఉంది అని సన్నీ లియోన్ వెల్లడించింది.
పూజాభట్ దర్శకత్వం వహిస్తున్న 'జిస్మ్2' చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే మహేష్ భట్ అందించారు. డినో మోరియా, పూజా భట్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్నీలియోన్‌తో పాటు రణదీప్ హూడా, అరుణోదయ్ సింగ్ రొమాన్స్ చేశారు. ఆగస్టు 3న ఈచిత్రం విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











