»   » నీలి చిత్రాల్లో నటించిన మాట వాస్తవమే(హాట్ ఫోటో ఫీచర్)

నీలి చిత్రాల్లో నటించిన మాట వాస్తవమే(హాట్ ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'జిస్మ్‌-2'తో బాలీవుడ్‌లో ప్రవేశించింది నీలి చిత్రాల తార సన్నీలియోన్‌. అయితే ఆ సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తరవాత 'రాగిణి ఎం.ఎం.ఎస్‌-2' సినిమాలో అవకాశం వచ్చింది. దీంతోపాటు ఆమె 'జాక్‌పాట్‌' సినిమాలోనూ నటిస్తోంది. కైజాద్‌ గుస్తద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. సచిన్‌ జోషి హీరో. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నటించేందుకు సన్నీలియోన్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


సన్ని లియోన్ మాట్లాడుతూ... ''గతంలో నేను నీలి చిత్రాల్లో నటించిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు నేను బాలీవుడ్‌లో హీరోయిన్ గా కొనసాగుతున్నాను. మళ్లీ మితిమీరిన శృంగార దృశ్యాల్లో కనిపించి పోర్న్‌స్టార్‌ అన్న సంగతి అందరికీ గుర్తు చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ సన్నివేశాలు చేయనని చెప్పాను'' అని తెలిపింది .

ఇండో-కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్‌ కెరీర్ బాలీవుడ్లో సజావుగానే సాగుతోంది. బిగ్‌బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన సన్నీ లియోన్ 'జిస్మ్-2' చిత్రంతో హీరోయిన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఫోర్న్ స్టార్ కావడంతో నగ్నంగా అందాలు ఆరబోయడానికి ఏమాత్రం సంకోచించని తత్వం కావడంతో పలువురు బాలవుడ్ నిర్మాతలు, దర్శకుడు ఆమెతో న్యూడ్ సీన్లు, హాట్ ఐటం సాంగులు చేయించి సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నాల్లోకి దిగి పోయారు. దీనికి తోడు సన్నీ లియోన్ న్యూడ్ అండ్ హాట్ ఫోటో షూట్లు అంతర్జాలాన్ని ముంచెత్తడంతో సన్నీ లియోన్ ఇండియాలో టాప్ సెలబ్రిటీగా మారి పోయింది.


మిగతా విశేషాలు...సన్నిలియోన్ హాట్ ఫోటోలతో...

‘జాక్ పాట్' ఎవరికి

‘జాక్ పాట్' ఎవరికి

ప్రస్తుతం సన్నీ లియోన్ హీరోయిన్‌గా బాలీవుడ్లో రెండు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో ఒకటి రాగిని ఎంఎంఎస్-2 ఒకటి కాగా, మరొక చిత్రం ‘జాక్ పాట్'. ఇటీవల ‘జాక్ పాట్' చిత్రం ఫస్ట్ లుక్ రిలీజైంది. తప్పనిసరిగా ప్రేక్షకులకు ఈ చిత్రం ‘జాక్ పాట్' తగిలిన అనుభూతి కలిగిస్తుందని చెప్తున్నారు.

టీవీ షో నుంచే...

టీవీ షో నుంచే...

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఒక్కసారి ఇండియాలో హాట్ టాపిక్ గా మారిన భామ సన్నీలియోన్. తనను మర్చిపోతున్నారనుకుందో ఏమో కానీ .. రీసెంట్ గా ఆమె బికినీ వేసుకుని..ఫోటో షూట్ చేయించుకుని హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మర్డర్ 3 చిత్రం కోసం రెడీ అవుతున్న ఈ భామ బాలీవుడ్ లో హాట్ ఫేవెరెట్ గా మారింది.

ఫోటో షూట్స్ అందుకే..

ఫోటో షూట్స్ అందుకే..

నటిగా తొలి అడుగులు వేసేటప్పుడు శిక్షణ తీసుకోవడం సాధారణమే. అయితే ఈ చిత్రంలో సన్నీ భిన్నమైన భావోద్వేగాల్ని పలికించాల్సి ఉందట. అయితే ఆమెకి వాణిజ్యపరమైన చిత్రాల్లో నటించిన అనుభవం లేదు. హావభావ ప్రకటనలో ఇబ్బందులు ఎదురు కాకుండా ఆమె కోసం శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ చిత్రంకు క్రేజ్ తేవటంలో భాగంగా ప్రత్యేకమైన ఫోటో షూట్ ని ఏర్పాటు చేస్తున్నారు.

ఫోర్న్ స్టార్ ఇమేజ్ ...

ఫోర్న్ స్టార్ ఇమేజ్ ...

ఎంత కాదన్నా.... సన్ని లియోన్ ఎన్ని కబుర్లు చెప్పినా ఆమె ఫోర్న్ స్టార్ ఇమేజ్ ఆమెను వదలటం లేదు. దాంతో ఆమెను తమ సినిమాల్లో చేయటానికి ఓ మాదిరి హీరోలు కూడా ఒప్పుకోవటం లేదు. సన్నిలియోన్ తో చేస్తే తమ సినిమాలకు ప్యామలీ ఇమేజ్ దెబ్బతింటుందని భావిస్తున్నారు. మహేష్ భట్ క్యాంప్, ఏక్తా కపూర్ తప్ప.. సన్నిలియోన్ తో చేసే ధైర్యం చేయటం లేదు. అయితే తాను బాలీవుడ్ లో సెటిల్ అవ్వటానికే వచ్చానని సన్ని చెప్పటం విశేషం.

తెరను వేడిక్కించింది...

తెరను వేడిక్కించింది...


‘జిస్మ్-2' చిత్రంతో పరిచయమైన ఈ ఫోర్న్ స్టార్.. అందచందాల ప్రదర్శనతో బాలీవుడ్ వేడిక్కిపోయింది. నటనకన్నా ఆమె శరీరంపైనే కెమెరాల దృష్టి. అది గమనించిన ఈ ముద్దుగుమ్మ ఇలా తను కేవలం ఫోర్న్ స్టార్ ని కాదు భారతీయ సంస్కృతిలో కూడా కలిసిపోగలని చెప్తోంది.

రెమ్యునేషన్ ఎక్కువే..

రెమ్యునేషన్ ఎక్కువే..

ఫోర్న్ స్టార్ నుంచి వెండితెర మహారాణిగా ఎదుగుతున్న సన్ని లియోన్ రెమ్యునేషన్ విషయంలోనూ భారీగానే డిమాండ్ చేస్తోంది. దానికి తగ్గట్లే తన క్రేజ్ ని పెంచుకునేందుకు ఇలాంటి ఫోటోలను మార్కెట్లో వదులుతోంది.

వ్యభిచారిని కాదు...

వ్యభిచారిని కాదు...

తానేమీ వ్యభిచారిని కాదని, ఫోర్న్ స్టార్ అంటే అర్దం వ్యభిచారం చేసే వాళ్లు కాదని సన్నిలియోన్ మీడియా వాపోతోంది. ఆమెను జనం తప్పు పడుతున్నారని, ఇక్కడు ఇండియాలో తనను సరిగా అర్దం చేసుకోకుండా మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్1ారని ఆమె అంటోంది.

ఫ్యాన్స్ కోసం...

ఫ్యాన్స్ కోసం...

ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తూనే ఓ ఫోర్న్ సినిమా నిర్మిస్తోంది. ఆ సినిమా తన అభిమానులను గ్యారెంటీగా సంతృప్తి పరుస్తుందని హామీ ఇస్తోంది. ఆ చిత్రానికి ఇండియాలో ఎక్కువ డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు.

తెలుగులోనూ..

తెలుగులోనూ..

సన్నీ లియోన్‌తో తెలుగులో ఓ సినిమా చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. తెలుగులో రూపొందించి దక్షిణాదిన ఇతర బాషల్లో అనువాదం చేసుకుంటే బోలెడు డబ్బులు వస్తాయని భావిస్తున్నారు. ఈ మేరకు తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఇంకా సన్నిలియోన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.

ఇండియన్ నే..

ఇండియన్ నే..

అలాగే తాన పేరెంట్స్ పంజాబ్ కి చెందిన వారే నని తాను ఇండియాకు చెందిన దాన్ని అనే అంది. తాను ఫోర్న్ ఇండస్ట్రీలోకి కావాలని వెళ్లలేదని, కానీ డబ్బు సంపాదించటానకి అదో మంచి మార్గం అని తెలిసాక వెళ్లకుండా ఉండలేకపోయాను అంది.

పేరు తెస్తుంది..

పేరు తెస్తుంది..

మొదట తన తల్లితండ్రులు తను ఫోర్న్ పరిశ్రమలోకి వెళ్తానంటే వ్యతిరేకించారు కానీ తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోమని తనను దగ్గరకు తీసుకున్నారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను జాక్ పాట్ లో నటిస్తున్నానని, ఆ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చింది.

ఓ గేమ్ చుట్టూ...

ఓ గేమ్ చుట్టూ...

‘జాక్ పాట్' చిత్రంలో సన్నీ లియోన్-సచిన్ జోషి లీడర్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కైజాద్ గుస్తాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోను ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్‌లుక్ ఫోటోలో సన్నీ లియోన్ రూపం అందంగా, ఆకట్టుకునే విధంగా సెక్సీగా ఉండటం గమనార్హం. సచిన్ జోషి ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నారు. ఓ డిఫరెంట్ కథాంశంతో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జాక్ పాట్ కు సంబంధించిన ఓ గేమ్ చుట్టూ ఈచిత్రం కథ తిరుగుతుంది

English summary
Sunny Leone is all set to turn on the heat with her co-star Sachin Joshi in her upcoming ‘Jackpot’. Currently the porn-star-turned-actress was spotted shooting in Goa with Sachin where she looked hot in a grey coloured dress.
Please Wait while comments are loading...