మహేష్ బాబు ఫ్యాన్స్ కు సూపర్ ఛాన్స్...
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు 14 రీల్స్ఎంటర్టెన్మెంట్స్ సంస్థ వారు సూపర్ చాన్స్ ప్రకటించారు. మహేష్ తాజా సినిమా 'ఆగడు' ప్రమోషన్ కార్యక్రమాల్లో అభిమానులను భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. ఆసక్తిగల అభిమానులు తమ వివరాలను aagadu.14reels.net మెయిల్ చేయండి.
ఆగడు సెకండ్ టీజర్ మహేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్ట్ 9న విడుదల చేయనున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఆగడు చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా నటిస్తోంది. శృతి హాసన్ ఐటం సాంగు చేయడం మరో ప్రత్యేకత. తమన్ సంగీతం అందించారు. 'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారి అంచనాలున్నాయి.

ఈ చిత్రానికి అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. త్వరలో సినిమా ఆడియోను విడుదల చేసిన సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. మహేష్ బాబు, విలన్ సోను సూద్ ఫైట్ సీన్లలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది.
క్లైమాక్స్ సీన్లు షూటింగ్ పూర్తయిన తర్వాత పాటల చిత్రీకరణ కోసం యూరఫ్ వెళ్లనున్నారు. నార్వే తో పాటు పలు ప్రాంతాల్లో పాటల చిత్రీకరణ జరుగనుంది. మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. సంగీత దర్శకుడు థమన్ పాటలు రెడీ చేసాడు. పాటల కంపోజింగ్ పూర్తయిన విషయాన్ని థమన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











