పరమ చెత్త సినిమా, భరించలేకపోయా.. సూపర్ డీలక్స్‌పై సినిమాటోగ్రాఫర్ కామెంట్

గత కొంత కాలంగా సూపర్ డీలక్స్ చిత్రం వార్తల్లో నిలుస్తోంది. దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా ఈ చిత్రాన్ని విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కించడమే ఇందుకు కారణం. ఈ చిత్రమో పాత్రలే అందరిని బాగా ఆకర్షించాయి. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ట్రాన్స్ జెండర్ గా నటించాడు. మార్చి 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ తరుణంలో ఓ సెలెబ్రిటీ మాత్రం సూపర్ డీలక్స్ చిత్రంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

కీలక పాత్రల్లో సమంత, రమ్యకృష్ణ

కీలక పాత్రల్లో సమంత, రమ్యకృష్ణ

విజయ్ సేతుపతితో పాటు సూపర్ డీలక్స్ చిత్రంలో సమంత, రమ్యకృష్ణ నటన కూడా కట్టుకుంది. రమ్యకృష్ణ ఈ చిత్రంలో పోర్న్ స్టార్ గా నటించింది. సూపర్ డీలక్స్ గురించి తమిళనాట హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఈ తరహాలో బలమైన కాన్సెప్ట్ తో వచ్చే చిత్రాలు చాలా అరుదుగా ఉంటాయని అంటున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నటరాజ్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

భరించలేకపోయా

భరించలేకపోయా

నటరాజ్ సుబ్రహ్మణ్యం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నిజ జీవితంలో ఇలాంటి అసహ్యమైన అంశాలని ప్రోత్సహించడం, అభినందించడం సరైనదేనా అని ప్రశ్నించారు. ఇలాంటి స్థాయిలేని చిత్రాలకు నేను దూరంగా ఉంటాను. సూపర్ డీలక్స్.. అసలు ఇది సినిమానేనా.. ఓ గాడ్.. భరించలేకపోయా అంటూ నటరాజన్ ట్వీట్ చేశారు. నటరాజన్ ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. పలువురు నెటిజన్లు నటరాజన్ వ్యాఖ్యలని ఖండిస్తున్నారు.

దూరంగా ఉండు

దూరంగా ఉండు

నటరాజన్ వ్యాఖ్యలకు నెటిజన్లు కూడా అంతే ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. అంతలా భరించలేకుంటే దూరంగా ఉండు. కానీ ఇలా చెత్త కామెంట్స్ చేయకండి. వెళ్లి మీకు నచ్చినట్లు గొప్ప చిత్రాలు తీసుకోండి అని నెటిజన్లు నటరాజన్ కు సూచిస్తున్నారు. నటరాజన్ వ్యాఖ్యలపై సూపర్ డీలక్స్ చిత్ర యూనిట్ ఇంకా స్పందించలేదు.

లింగ వివక్ష

లింగ వివక్ష

దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా శృంగారం, లింగ వివక్ష లాంటి అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ నటుడిగా దుసుకుపోతున్న విజయ్ సేతుపతి ఈ చిత్రంలో మరో సాహసోపేతమైన పాత్రని చేశారు. హీరోగా నటిస్తూ ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించడం మామూలు విషయం కాదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X