»   » త్రివిక్రమ్ కలం నుండి జాలువారిన కొన్ని సూపర్ డైలాగ్స్...

త్రివిక్రమ్ కలం నుండి జాలువారిన కొన్ని సూపర్ డైలాగ్స్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్రివిక్రమ్ శ్రీనివాస్.... ఆయన్ను దర్శకుడిగా కంటే, మాటల రచయిత..కాదు కాదు మాటల మాత్రికుడు అని పిలవడానికే ఎక్కువ మంది ఇష్టపడతారు. ఆయనకు ఎవరైనా అభిమానులుగా మారారంటే కేవలం ఆయన కలం నుండి జాలువారే డైలాగులకు ముగ్ధులయ్యారని తప్ప మరో కారణం లేదని చెప్పడంలో ఎలంటి సందేహం లేదు.

Also Read: త్రివిక్రమ్ స్పీచ్ సూపర్బ్: బూతులు లేకుండా చాలా కష్టం అంటూ...

తెలుగు సినిమా రంగంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న రచయితగా త్రివిక్రమ్ చరిత్ర సృష్టించారు ఒకప్పుడు. కోటి రూపాయల పారితోషికం తీసుకున్న తొలి తెలుగు రచయిత ఆయన మాత్రమే. పంచ్ డైలాగులు, ప్రాస డైలాగులు మాత్రమే కాదు.... జీవిత సత్యాలను ఆకట్టుకునేలా డైలాగుల రూపంలోకి మార్చి ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడం ఆయనకే చెల్లింది.

Also Read: త్రివిక్రమ్ హర్ట్ అయ్యాడు, ఎప్పటికీ ఆ నిర్మాతతో చేయడేమో?

ఒకప్పుడు ఆయన డైలాగులు కేవలం యువతకు నచ్చేలా మాత్రమే ఉండేవి. దర్శకుడిగా మారిన తర్వాత త్రివిక్రమ్ తన డైలాగులుకు మరింత పదును పెట్టారు. కుటుంబ విలువలు, బంధాలు, జీవిత సత్యాలను జోడిస్తూ ఆయన రాసే డైలాగులు కుటుంబ ప్రేక్షకులు సైతం వీర ఫ్యాన్స్ అయిపోయారు.

హీరో, హీరోయిన్ ఎవరు? అనే విషయంలో సంబంధం లేకుండా కేవలం 'ఇది త్రివిక్రమ్ సినిమా' అనే ఒక్క మాటతోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే స్థాయికి ఆయన వచ్చారంటే ఇదంతా ఆయన రాసే డైలాగ్స్ పవర్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదోమో?

త్రివిక్రమ్ కలం నుండి జాలువారిన కొన్ని సూపర్ డైలాగ్స్

ఫ్రెండ్స్ కాలేరు

ఫ్రెండ్స్ కాలేరు

వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయిపోయినట్లు...ఫెయిల్ అయిపోయిన ప్రేమికులందరూ ప్రెండ్స్ కాలేరు

సాంప్రదాయాలు

సాంప్రదాయాలు

మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి కానీ, సంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు

హక్కు లేదు

హక్కు లేదు

సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు...చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు

అనవసరం

అనవసరం

బాధలో ఉన్న వాడిని బాగున్నావా అని అడగటం అమాయకత్వం...బాగున్న వాడిని ఎలా ఉన్నావని అడగటం అనవసరం

మాట్లాడకూడదు సార్

మాట్లాడకూడదు సార్

మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి...కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు సార్

మనకు నచ్చేలా ఉండటమే

మనకు నచ్చేలా ఉండటమే

అందంగా ఉండటం అంటే మనకు నచ్చేట్లు ఉండటం కానీ...ఎదుటివారికి నచ్చేలా ఉండటం కాదు

అద్భుతం

అద్భుతం

అద్భుతం జరిగేప్పుడు ఎవరూ గుర్తించలేరు...జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు

పైకి రాలేడు

పైకి రాలేడు

తండ్రికి, భవిష్యత్తుకి భయపడని వాడు జీవితంలో పైకి రాలేడు

నిజమే

నిజమే

కారణం లేని కోపం.. ఇష్టం లేని గౌరవం... బాధ్యత లేని యవ్వనం...జ్ఞాపకం లేని వృద్దాప్యం అనవసరం..

యుద్ధం

యుద్ధం

యుద్దంలో గెలవటం అంటే శత్రువుని చంపడం కాదు...ఓడించడం

నలుగురు

నలుగురు

మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వారు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా...ఎంత పొగొట్టుకున్నా తేడా ఉండదు.

అబద్దం

అబద్దం

నిజం చెప్పక పోవడం అబద్దం...అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం.

English summary
Probably the best dialogue writer of our Generation. His dialogues surely stand out in the world of Telugu Cinema. Even the most complex philosophical dialogues can be understood easily when it is Trivikram with the pen.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu