ఫిలింఫేర్‌లో.. సూపర్
హీరో నాగార్జున పరిస్థితి ప్రస్తుతం సూపర్‌గా ఉంది. ఆగస్టు 29న ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని ఒక పక్క అభిమానులు వేడుకలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవంక నాగార్జున బాస్ చిత్రం షూటింగ్ పూర్తి చేయడంలో నిమగ్నమై ఉన్నారు. బాస్‌కు ఇప్పటికే బిజినెస్‌లో పెద్ద క్రేజ్ రావడంతో ఆ చిత్ర నిర్మాత, నాగార్జున స్నేహితులైన డి. శివప్రసాద్‌రెడ్డి కూడా ఆనందంగా ఉన్నారు.
ఇంతలో ఆయనకు మరో శుభవార్త అందింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన సూపర్ చిత్రం 2006 ఫిలింఫేర్ అవార్డులకు 9 విభాగాలలో నామినేషన్ పొందింది. ఈ చిత్రం ఎంతో అట్టహాసంగా విడుదల చేసినా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై వచ్చిన చిత్రాలతో పోలిస్తే సూపర్ చిత్రం ఏ రకంగానూ ముందువరుసలో నిలవదు. అటువంటిది ఈ చిత్రానికి 9 విభాగాలలో నామినేషన్ రావడం నిజంగా నాగార్జునకు ఆశ్చర్యం, ఆనందం రెండూ ఏకకాలంలో అందించడం విశేషం.


Click it and Unblock the Notifications