అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో గోపిచంద్, కామ్నాజట్మలాని జంటగా వచ్చి హిట్టయిన సినిమా 'రణం'. అదిప్పుడు తమిళంలోకి 'స్టాలిన్' పేరుతో డబ్బింగ్ అవుతోంది. హఠాత్తుగా ఇప్పుడీ సినిమా తమిళంలోకి వెళ్ళటం వెనుక పెద్ద కారణమే ఉందటున్నారు ఫిల్మ్ నగర్ వారు. అమ్మ రాజశేఖర్ కి ఇప్పుడు తెలుగులో డిమాండు లేదు. అతను తీసిన 'ఖతర్నాక్', 'టక్కరి' భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దాంతో తన సోదరుడినే హీరోగా పెట్టి 'బీబత్సం' సినిమా ప్లాన్ చేసాడు. కానీ మరో ప్రక్క తన తోటి కొరియాగ్రాఫర్స్ లారన్స్, ఫ్రభుదేవా తమిళంలోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోవటం చూసి అక్కడా సినిమాలు ఫ్రారంభిమిద్దామనే నిర్ణయానికి వచ్చాడని తెలుస్తోంది. అందుకు పునాదిగా నా స్టైల్ ఇది అని చూపటానికి తన సినిమాలు డబ్బింగ్ కి యోర్పాట్లు చేసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే 'ఖతర్నాక్' డబ్బింగ్ పనులు స్పీడుగా జరుగుతున్నాయి. ఈ సంగతి ప్రక్కన పెడితే 'రణం' అక్కడా హిట్టయితే ముందు గోపీచంద్ కి మార్కెట్ పెరుగుతుందని అతని అభిమూనులు ఆశ పడుతున్నారు.