పవర్ స్టార్ సినిమా బిజినెస్ కూడా కేక
ఈ మధ్య స్టార్ హీరోలు, స్టార్ దర్శకుల సినిమాలు విడుదలకు ముందే భారీగా బిజినెస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి ఈగ, దమ్ము, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు కోట్లాది రూపాయల బిజినెస్ చేశాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్'గబ్బర్ సింగ్' చిత్రం కూడా వాటి రేంజ్‌కి ఏమాత్రం తగ్గకుండా కేక పుట్టిస్తోంది. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం 'గబ్బర్ సింగ్' శాటిలైట్ రైట్స్‌ను జెమినీ టీవీ రూ. 6 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. హిందీ సూపర్ హిట్ మూవీ దబాంగ్ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కొండవీడు పోలీస్‌గా కనిపించబోతున్నాడు. క్రిమినల్స్ ఆట కట్టించడానికి తిక్క పోలీస్ గా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాడని స్పష్టం అవుతోంది. పాత్రకు తగిన విధంగా 'నాకు కొంచె తిక్క ఉంది..కానీ దానికి లెక్క ఉంది' అంటూ ఆసక్తికరంగా డైలాగులు ప్రయోగించాడు దర్శకుడు. శృతి హాసన్ పల్లెటూరి అమ్మాయి 'భాగ్య లక్ష్మి' పాత్రలో దర్శనం ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications











