అసెంబ్లీకి డుమ్మా.. హీరోయిన్‌తో స్టెప్పులు.. సూపర్‌స్టార్ నిర్వాకమిదీ..

By Rajababu

Recommended Video

అసెంబ్లీ సమావేశాలకు రెబల్ స్టార్ డుమ్మా,మాలాశ్రీతో కలిసి డ్యాన్స్ లు : వీడియో వైరల్| Oneindia Telugu

రాజకీయ నాయకులుగా మారిన సినీ నటులు, క్రీడాకారులు ప్రవర్తన, ప్రజా సంక్షేమంపై అంకితభావంపై ఇప్పటికే భారీ ఎత్తున చర్చ జరుగుతున్నది. రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటులు ప్రజా సేవకు దూరంగా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో కన్నడ సూపర్‌స్టార్, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబరీష్ వ్యవహారం వివాదాస్పదమైంది. అసెంబ్లీకి వెళ్లకుండా హీరోయిన్ సినీ నటి మాలా శ్రీతో డాన్సు చేయడం తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. అసలు ఏమి జరిగిందంటే..

 విమర్శల పాలైన అంబరీష్

విమర్శల పాలైన అంబరీష్

కర్ణాటక అసెంబ్లీలో డీఎస్పీ గణపతి ఆత్మహత్య వ్యవహారంపై బెళగావి సువర్ణసౌధ విధానసభ రెండోరోజూ వాదనలు, ప్రతివాదనలతో ప్రతిధ్వనించింది. గణపతి కేసుపై సభలో చర్చ జరగాలని, సీబీఐ ఏ1 గా పేర్కొన్న మంత్రి కేజే జార్జ్ తక్షణమే రాజీనామా చేయాలని వరుసగా మంగళవారం ప్రతిపక్షం డిమాండ్ చేసింది. రెండో రోజు కూడా సభ వ్యవహారాలు జరుగకుండా బీజేపీ పక్షనేత జగదీష్ శెట్టర్ సహా ఆ పార్టీ నేతలు అడ్డుపడ్డారు. మరోవైపు బాధ్యతాయుత అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబరీష్ మాత్రం డ్యాన్సులు చేస్తూ విమర్శల పాలయ్యారు.

 అసెంబ్లీకి డుమ్మా కొట్టి

అసెంబ్లీకి డుమ్మా కొట్టి

అలా సమావేశాలు ఓ పక్క జరుగుతుంటే.. మండ్యా అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సినీ నటుడు అంబరీష్ అసెంబ్లీకి డుమ్మాకొట్టి బెంగళూరులో జరిగిన 'ఉప్పు హుళి ఖార' సినిమా టీజర్ విడుదల వేడుకలో అంబరీష్ పాల్గొన్నారు.

 మాలాశ్రీతో స్టెప్పులు

మాలాశ్రీతో స్టెప్పులు

ఈ సందర్భంగా యాంకర్ అనుశ్రీ కోరిక మేరకు సినీ నటి మాలాశ్రీతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. దీంతో ఆయన బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ మండిపడుతున్నారు. ఆయన రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

అంబరీష్ వీడియో వైరల్

బెంగళూరులో జరిగిన ఈవెంట్లో అంబరీష్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయన బాధ్యతారాహిత్యంపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. ప్రజల కష్టాలు పట్టించుకోకుండా, సామాజిక అంశాలపై నిర్లక్ష్యంతో పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఫంక్షన్లలో స్టెప్పులేస్తున్న వ్యక్తి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

 ఉప్పు హుళి ఖారా టీజర్ రిలీజ్

ఉప్పు హుళి ఖారా టీజర్ రిలీజ్

కన్నడ చిత్రం ఉప్పు హుళి ఖారా టీజర్ రిలీజ్ ఫంక్షన్ మంగళవారం బెంగళూరులోని గోల్డ్ ఫించ్ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ అంబరీష్, కామత్ (ఇన్ఫోసిస్) తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రమేశ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇమ్రాన్ సర్దారియా దర్శకత్వం వహిస్తున్నారు.

 పునీత్ పాట.. అంబరీష్ స్టెప్పులు

పునీత్ పాట.. అంబరీష్ స్టెప్పులు

సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పాడిన రో రో రోమ్.. నన్నే నిన్నా ప్రేమియో అనే పాటకు అంబరీష్ విడుదల చేసి మాలాశ్రీ , ఇతర హీరోయిన్లతో డాన్సులు చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X