ఫ్రెండ్స్ గా నటిస్తోన్న సూపర్ స్టార్, కామెడి స్టార్!
మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న 'భరత్ అనే నేను' సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత మహేష్ బాబు వంశి పైడిపల్లి సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు వైజయంతీ మూవీస్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్, దిల్‌రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు ప్రముఖ బాలీవుడ్ కెమెరామెన్ కె.యు.మోహనన్ పనిచేయనున్నారు. హిందీలో 2006లో వచ్చిన డాన్ చిత్రానికి, తలాష్, రయీస్ వంటి భారీ చిత్రాలకు అద్భుతమైన విజువల్స్‌ని అందించిన కె.యు.మోహనన్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌చెయ్యడం విశేషం.
తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో అల్లరి నరేష్, మహేష్ బాబు ఫ్రెండ్స్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. అల్లరి నరేష్ ఈ సినిమాలో మహేష్ కు సమానమైన పాత్రలో కనిపించబోతున్నాడు. వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.


Click it and Unblock the Notifications











