twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ అప్పటి నుంచి మానేశాడు.. నాన్ వెజ్‌తో ఫుల్ మీల్స్ పెట్టింది నేనే.. సూపర్ స్టార్ కృష్ణ!

    |

    300 పైగా చిత్రాల్లో దిగ్విజయంగా నటించి సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న కృష్ణ జన్మ దినం నేడు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినీరాజకీయ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సమ్మోహనం చిత్ర యూనిట్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఆయన చేతులమీదుగానే ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సమ్మోహనం చిత్ర కథానాయకుడు సుధీర్ బాబు, దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి, నిర్మాత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. సరదాగా వీరు ముగ్గురూ కృష్ణతో చిట్ చాట్ నిర్వహించారు. సమ్మోహనం ప్రస్తావించిన అన్ని విషయాలకు కృష్ణ సమాధానం ఇచ్చారు.

    Recommended Video

    Sammohanam Movie Theatrical Trailer
     అచ్చ తెలుగు టైటిల్

    అచ్చ తెలుగు టైటిల్

    సమ్మోహనం అనే టైటిల్ వినగానే అచ్చతెలుగు టైటిల్స్ కొన్ని తన మదిలో మెదిలినట్లు కృష్ణ తెలిపారు. తన చిత్ర టైటిల్స్ అన్ని అచ్చతెలుగు పదాలే ఉంటాయని కృష్ణ తెలిపారు. పండంటి కాపురం, పాడిపంటలు, ఈనాడు, ప్రజారాజ్యం, పండంటి కాపురం వంటి తెలుగు టైటిల్స్ ని ప్రస్తావించారు.

    ఇప్పుడు చాలా తక్కువ

    ఇప్పుడు చాలా తక్కువ

    ఈ మధ్యకాలంలో తెలుగు టైటిల్స్ తో సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయని కృష్ణ అన్నారు. ఇటీవల రంగస్థలం, మహానటి వంటి పేర్లు వింటున్నానని తెలిపారు.

    మహేష్ మానేశాడు

    మహేష్ మానేశాడు

    చిన్నప్పుడు మహేష్ బర్త్ డేని ఎలా సెలెబ్రేట్ చేసేవారు అని ప్రశ్నించగా.. మద్రాసులో ఉన్నప్పుడు చాలా గ్రాండ్ గా చేసేవాళ్ళం. కానీ స్టార్ అయ్యాక బర్త్ డే చేసుకోవడం మహేష్ మానేశాడు అని కృష్ణ అన్నారు.

    నాన్ వెజ్ తో ఫుల్లుగా భోజనం

    నాన్ వెజ్ తో ఫుల్లుగా భోజనం

    కృష్ణ గారి నిర్మాణ సంస్థ పద్మాలయ స్టూడియోస్ చాలా మందికి ఉపాధి కల్పించిందని, అక్కడ భోజనం చేయని వారు ఉండరని సమ్మోహనం నిర్మాత కృష్ణ ప్రసాద్ అన్నారు. దానికి కృష్ణ బదులిస్తూ.. మద్రాసులో ఉన్నప్పుడు షూటింగ్ సమయాల్లో సాంబారు భోజనం పెట్టేవారు. మన నిర్మాణ సంస్థ ప్రారంభించాక నాన్ వెజ్ తో ఫుల్లుగా భోజనం పెట్టడం ప్రారంభించింది నేనే. అప్పటినుంచి అందరూ నాన్ వెజ్ పెట్టడం ప్రారంభించారని కృష్ణ అన్నారు.

    సుధీర్ అడిగిన ప్రశ్న

    సుధీర్ అడిగిన ప్రశ్న

    మీ చిత్రాలలో మీకు నచ్చిన లవ్ స్టోరీ ఏంటని సుధీర్ ప్రశ్నించగా.. పండంటి కాపురం చిత్రంలో రొమాంటిక్ అంశాలు చాలా ఉంటాయని కృష్ణ అన్నారు. ఆ చిత్రం విడుదలైన అన్ని సెంటర్స్ లో 100 రోజులు ఆడింది. 14 సెంటర్స్ లో 25 వారాలు ఆడిందని సూపర్ స్టార్ అన్నారు.

    కృష్ణ బయోపిక్ హీరో ఎవరు

    కృష్ణ బయోపిక్ హీరో ఎవరు

    ఈ మధ్యకాలంలో మహానటి లాంటి బయోపిక్ చిత్రాలు వస్తున్నాయి. మీ బయోపిక్ లో హీరోగా ఎవరు చేస్తే బావుంటుంది.. దర్శకుడు ఎవరు అని సుధీర్ అడగగా.. ఇండస్ట్రీలో కొత్త రక్తం వస్తోంది. ఎప్పుడో తీయబోయే చిత్రం గురించి ఇప్పుడు ఎందుకు అని కృష్ణ అన్నారు.

    English summary
    Super star Krishna about Mahesh Babu birth day. Sammohanam team interviews Krishna
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X