బాలకృష్ణతో హీరోయిన్ గా మహేష్ బాబు సోదరి.. ఫ్యాన్స్ గొడవతో వెనుకడుగు!
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రహీరోగా ఒకప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వారిలో సూపర్ స్టార్ కృష్ణ కూడా టాప్ లిస్టు లో ఉంటారు అని చెప్పాలి. అప్పట్లో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేసేది. కృష్ణ వారసత్వం నుంచి వచ్చిన మహేష్ బాబు కూడా అదే తరహాలో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఒకానొక సమయంలో మహేష్ సోదరి కూడా వెండి తెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని అనుకుందట. బాలకృష్ణ తో కూడా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఒక ఘటన తో ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
Recommended Video


మహేష్ బాబు అలా సరదాగా..
ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ స్టార్ హీరోగా ఎంత క్రేజ్ అందుకున్నప్పటికీ కూడా తన కుటుంబ సభ్యులను ఎన్నడూ కూడా మిస్ అయ్యేవారు కాదు. పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని కొన్నిసార్లు షూటింగ్ స్పాట్ కు అందరినీ పిలిచేవారు. మహేష్ బాబు అలా షూటింగ్ స్పాట్లోనే ఆడుకుంటూ సరదాగా చేసిన క్యారెక్టర్ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచాయి.

హీరోయిన్ అవ్వాలని..
అయితే మహేష్ బాబు మాత్రమే కాకుండా ఘట్టమనేని కుటుంబం నుంచి ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా కొన్నాళ్లు చిత్రపరిశ్రమలో కొనసాగిన విషయం తెలిసిందే. అలాగే కృష్ణ గారి కుమార్తెలలో ఒకరు ఒక హీరోయిన్ గా వెండితెరపై వెలగాలని చాలా కలలు కన్నారు. అందుకోసం ప్రత్యేకంగా కొంతకాలం శిక్షణ కూడా తీసుకునే హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలని గట్టిగానే ప్రయత్నాలు కూడా జరిగాయి.

ఘట్టమనేని వారసత్వం
సూపర్ స్టార్ కృష్ణకు మొత్తం ఐదు మంది పిల్లలు. అందులో రమేష్ బాబు పెద్ద కుమారుడు కాగా ఆ తరువాత పద్మావతి ఘట్టమనేని వంశంలో పెద్దకుమార్తె. తర్వాత రెండవ కూతురు మంజుల ఘట్టమనేని అనంతరం మహేష్ బాబు ఇంట్లో నాలుగవ తనయుడు. అందరికంటే చిన్న కూతురు ప్రియదర్శిని.. ఆమె హీరో సుధీర్ బాబు ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

కృష్ణ వద్దని చెప్పడంతో..
అయితే మంజుల ఘట్టమనేని సినిమా పరిశ్రమలో కొనసాగాలని యంగ్ ఏజ్ లో చాలా ప్రయత్నాలు చేసింది. మొదట సూపర్ స్టార్ కృష్ణని అడిగినప్పుడు ఆయన వద్దని కూడా అన్నారు. కానీ లాజికల్ గా ఆలోచించిన మంజుల మీ అమ్మ నాన్న మీకు సపోర్ట్ చేయకపోతే మీరు ఈ స్థాయిలో ఉండేవారా అని అడగడంతో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఆలోచించే అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

బాలకృష్ణకు హీరోయిన్ గా..
ఇక ఏ మాత్రం ఆలోచించకుండా నందమూరి బాలకృష్ణ కూడా మంజుల ఘట్టమనేని తన సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో 1994లో బాలకృష్ణ టాప్ హీరో సినిమా కోసం మంజుల ఘట్టమనేని పెద్దగా ఆలోచించకుండానే ఓకే చేసేశారు సినిమాలు కూడా అయిపోయింది.

ఆ గొడవతో క్యాన్సల్
అయితే ఆ సినిమా ప్రారంభోత్సవంలో ఘట్టమనేని అభిమానులు ఒక్కసారిగా తిరగబడ్డారు. సూపర్ స్టార్ కృష్ణ కూతురు అంటే మాకు సోదరి లాంటివారు అని హీరోయిన్గా చేయడానికి వీలు లేదు అనే ఎస్.వి.కృష్ణారెడ్డి కటౌట్ లను కూడా చింపేసి నానా గొడవ చేశారు. అదే విషయాన్ని ఇటీవల కృష్ణ తన కూతురు మంజుల ఘట్టమనేని యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అభిమానులు ఎప్పుడూ కూడా నిన్ను ఒక హీరో కూతురిగా చూడలేదు అని సోదరి గానే చూశారు అని అందుకే అలా ఊహించుకోలేక పోయారు అని కూడా కృష్ణ తెలియజేశాడు.


Click it and Unblock the Notifications











