ఈ తరం దర్శకులపై సూపర్ స్టార్ కృష్ణ విశ్వాసం..!?
మహేష్ బాబుతో హిట్ కొట్టలేక పొతే, అది ఆ దర్శకుడి అసమర్దతే అది శ్రీను వైట్ల అభిప్రాయం. మహేష్‌బాబు మీద నిజంగా ఆయనకు వున్న నమ్మకం అయ్యి వుండవచ్చు. అయితే సూపర్ స్టార్ కృష్ణ మాత్రం తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు సమర్థ వంతమైన డైరెక్టర్లు, సాంకేతిక నిపుణుల చేతిలో ఉందని సూపర్ స్టార్ కృష్ణ ఆనందం వ్యక్తం చేసారు. 'దూకుడు" సక్సస్ మీట్ లో భాగంగా విలేకరులతో మాట్లాడుతూ కృష్ణ ఈ వ్యాఖ్యలు చేసారు.
ఈ కొత్త తరం దర్శకులు యావత్ దేశంలోనే ఖ్యాతి గడిస్తున్నారని కితాబిచ్చారు. అందుకనే బాలీవుడ్ నటులు మన స్క్రిప్ట్స్ రీమేక్ చేసుకునేందుకు తహతహలడుతున్నారని తెలిపారు. దూకుడు చిత్రాన్ని హిందీ, తమిళాల్లో చేయాలని చూస్తున్నారనీ, అతికొద్ది సినిమాలకే మహేష్ బాబు క్రేజీస్టార్ గా ఎదగడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
అంతేకాదు మన డైరెక్టర్లతో వారంతా పనిచేయాలని అనుకోవటం శుభసూచకమన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ సృజనాత్మక నైపుణ్యాన్ని పెంచడానికి, మరిన్ని సినిమాలు చేసేందుకు కొత్త తరం హీరోలు ముందుండాలని కృష్ణ పిలుపునిచ్చారు. అది మాత్రమే చిత్ర పరిశ్రమను ఉజ్వలంగా ఉంచుతుందన్నారు. 'దూకుడు" సినిమాలో కామెడి ట్రాక్ ను ఈ సందర్భంలో కృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. చాలా కాలం తరువాత తాను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి కమెడియన్స్ ను చూస్తున్నానన్నారు.


Click it and Unblock the Notifications











