అభిమాని కుమార్తె వివాహానికి హాజరైన సూపర్ స్టార్ కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ- మహేష్ సేన జాతీయ అధ్యక్షులు, మాజీ జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్, తెరాస నాయకుడు దిద్ది రాంబాబు పద్మ దంపతుల కుమార్తె స్వాతి వివాహము అంజని కుమార్‌తో హైదరాబాద్ పింగళి వెంకటరామిరెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. ఈ వివాహానికి సూపర్ స్టార్ కృష్ణ, హీరో నవీన్ విజయ్ కృష్ణ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తాను హీరోగా యాక్టివ్‌గా ఉన్న రోజుల నుంచే అభిమానులను ఎంతో ప్రేమగా, తన సొంత మనుషుల్లా చూసుకునే సూపర్ స్టార్ కృష్ణ.. వారి కష్టసుఖాల్లో పాలు పంచుకునే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అభిమానుల ఆదరణ వల్లే తాము స్టార్లుగా అవతరించామని నమ్మే ఆయన నటుడిగా రిటైరైన తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తున్నారు.

కృష్ణ నట వారసత్వాన్ని పునికిపుచ్చుకుని టాలీవుడ్ టాప్ హీరోగా ఎదిగిన మహేష్ బాబు సైతం... అభిమానుల విషయంలో తండ్రి అనుసరించిన మార్గాన్నే అనుసరిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకున్నారు.
మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' చిత్రం చేస్తున్నారు. అశ్వినీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











