క్రికెట్ బెట్టింగులో సూపర్ స్టార్ కృష్ణ!
క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో సాగే ఓ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ నటించబోతున్నారు. 'హరి ఓం' పేరుతో రూపొందుతున్న ఈచిత్రంలో శేఖర్, నిషాలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ లోక్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ఈది సురేష్ కుమార్ నిర్మిస్తున్నారు. అజయ్ పట్నాయక్ బాణీలు సమకూర్చారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం జూన్ మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటి వరకు క్రికెట్ బెట్టింగుల నేపథ్యంలో బాలీవుడ్‌లో పలు చిత్రాలు వచ్చాయి. అయితే తెలుగులో మాత్రం బెట్టింగులపై డీప్ సబ్జెక్టుతో సినిమా రాలేదనే చెప్పాలి. 'హరి ఓం' చిత్రంలో బెట్టింగ్ దందాను లోతుగా చర్చించనున్నారు. భారతీయులు అమితంగా ఇష్టపడే ఈ క్రీడ వెనక సాగే చీకటి కోణాలు ఇందులో చూపించనున్నారు.
బుకీలు సినిమా హీరోయిన్ల ప్లేయర్లకు ఎరగా వేసి ఫిక్సింగులో దింపే వైనం కూడా ఇందులో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. సూపర్ స్టార్ కృష్ణ నటిస్తుండటంతో సినిమాపై ఇటు మహేష్ బాబు అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది.
కృష్ణ తరచూ ఏదో ఒక చిత్రంలో అతిథి పాత్రలో కనిపిస్తూనే ఉన్నారు. ఆయన ఎంచుకునే పాత్రలు మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఉంటున్నాయి. ఈచిత్రంలో కూడా కృష్ణ ఒక ఇన్‌స్సైరబుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











