Don't Miss!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘సేవకుడు’ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ
శ్రీకాంత్ హీరోగా సముద్ర దర్శకత్వంలో సముద్ర దర్శకత్వంలో 'సేవకుడు' అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలొ సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. విదేశాలలో సంపాదించిన డబ్బును ఇండియాలో ఇన్వెస్ట్ చేసి ఇండియా ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచాలకునే ఎన్నారై పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. గతంలో శ్రీకాంత్ కృష్ణ హీరోగా వచ్చిన'వారసుడు', 'రౌడీ అన్నయ్య' అనే చిత్రాల్లో నటించారు.
సమాజంలో పోరిగి పోతున్న రాజకీయ అవినీతి కథాంశంతో చిత్రం రూపొందతోంది. ఇందులో శ్రీకాంత్, ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జినాల్ పాండే హీరోయిన్ గా పరిచయం అవుతున్నట్లు తెలుస్తోంది. ఎల్.వి.ఆర్.ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కథ, మాటలు: స్వామిజీ విజయ్, ఫొటోగ్రఫీ: పి.ఎస్.బాబు, సంగీతం: శ్రీకాంత్ దేవా, ఎడిటింగ్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మేక రమణారావు, లైన్ ప్రొడ్యూసర్: డి.ఎస్.ఆర్., నిర్మాణసారథ్యం: తారకరామా ఫిలిమ్స్, నిర్మాత: లగడపాటి శ్రీనివాసరావు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.సముద్ర.