శ్రీదేవి మృతితో కృష్ణ షాక్, ఎక్కువ సినిమాలు ఆయనతోనే, పక్క పక్క ఇళ్లు..నరేష్ తో స్నేహం

శ్రీదేవి మృతితో సూపర్ స్టార్ కృష్ణ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. టాలీవుడ్ లో శ్రీదేవి అధిక చిత్రాల్లో నటించింది కృష్ణ తోనే. కృష్ణ కుటుంబానికి శ్రీదేవికి చాలా దగ్గర సాన్నిహిత్యం ఉంది. ఈ సందర్భంగా కృష్ణ షాక్ కి గురయ్యారు. శ్రీదేవి మృతి తనని కలచివేసిందని కృష్ణ అన్నారు. కృష్ణ, శ్రీదేవి కలసి దాదాపుగా 31 చిత్రాల్లో నటించడం విశేషం. శ్రీదేవి కృష్ణ కలసి నటించిన తొలి చిత్రం బుర్రిపాలెం బుల్లోడు.

శ్రీదేవి మరణం కలచివేసింది

శ్రీదేవి మరణం కలచివేసింది

సూపర్ కృష్ణ శ్రీదేవి మృతి పట్ల సంతాపం తెలియజేసారు. శ్రీదేవి అకాల మరణం తనని కలచి వేసిందని కృష్ణ ఆవేదన వ్యక్తం చేసారు. కృష్ణతో కలసి శ్రీదేవి తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించారు.

80 లో 31 సూపర్ స్టార్ తోనే

80 లో 31 సూపర్ స్టార్ తోనే

తెలుగులో శ్రీదేవి 80 చిత్రాల్లో నటించింది. అందులో 31 చిత్రాలు సూపర్ స్టార్ కృష్ణతోనే నటించారు. శ్రీదేవి మృతితో ఈ విషయాన్ని కృష్ణ గుర్తు చేసుకున్నారు. పిన్న వయసులోనే శ్రీదేవి మరణించడం బాధాకరం అని కృష్ణ అన్నారు.

 కృష్ణ కుటుంబంతో శ్రీదేవి సాన్నిహిత్యం

కృష్ణ కుటుంబంతో శ్రీదేవి సాన్నిహిత్యం

కృష్ణ కుటుంబంతో శ్రీదేవికి చిన్ననాటి నుంచే మంచి సాన్నిహిత్యం ఉంది. చెన్నైలో సూపర్ స్టార్ కృష్ణ, శ్రీదేవి ఇళ్లు పక్క పక్కనే ఉండేవి. ఈ విషయాన్ని కృష్ణ గుర్తు చేసుకున్నారు.

మా ఇంట్లోనే ఆడుకునేది

మా ఇంట్లోనే ఆడుకునేది

శ్రీదేవి చిన్నతనంలో తన ఇంట్లోనే ఆదుకునేదని కృష్ణ అన్నారు. శ్రీదేవి, కుటుంబంతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని కృష్ణ అన్నారు.

నరేష్ తో స్నేహం

నరేష్ తో స్నేహం

సీనియర్ నటుడు నరేష్, శ్రీదేవి చిన్ననాటి నుంచే స్నేహితులని కృష్ణ అన్నారు.

తొలి చిత్రం అదే

తొలి చిత్రం అదే

శ్రీదేవి కృష్ణతో కలసి హీరోయిన్ నటించిన తొలి చిత్రం బుర్రిపాలెం బుల్లోడు. అంతకు ముందు మానాన్న నిర్దోషి చిత్రంలో శ్రీదేవి బాల నటిగా నటించారు. తరువాత రామ్ రాబర్ట్ రహీం, గడసరి అత్త సొగసరి కోడలు వంటి చిత్రాల్లో కృష్ణ సరనస శ్రీదేవి నటించారు.

విజయనిర్మల సంతాపం

విజయనిర్మల సంతాపం

శ్రీదేవి మృతి పట్ల తన సతీమణి విజయనిర్మల దిగ్బ్రాంతి వ్యక్తం చేసారని కృష్ణ తెలిపారు. భారతీయ చిత్ర పరిశ్రమ గొప్ప నటిని కోల్పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు కృష్ణ వివరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X