For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిన్నప్పటి నుంచి రామారావుగారి అభిమానిని: ఎన్టీఆర్ బయోపిక్ వేడుకలో కృష్ణ

    |

    మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ కనివీని ఎరుగని రీతిలో నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ... చిన్నప్పటి నుంచి రామారావుగారి అభిమానిని. డిగ్రీ పూర్తయిన తర్వాత ఆయన్ను చూసేందుకు మద్రాస్ వెళ్లాను. వారిని కలిసి సినిమాల్లో నటించే ఇంట్రస్ట్ ఉంది, మీ పిక్చర్లో వేషం ఉంటే ఇవ్వండి అన్నాను. అపుడు ఆయన నువ్వు చిన్నపిల్లాడిలా ఉన్నావు, రెండు మూడు సంవత్సరాలు ఆగితే తప్పకుండా నీకు వేషం ఇస్తాం, నువ్వు పనికొస్తావు అన్నారు.

    ఈ లోగా ఆదుర్తి సుబ్బారావుగారు నన్ను తెనెమనసులు చిత్రంలో హీరోగా చేశారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఐదో పిక్చర్ 'స్త్రీ జన్మ' ద్వారా ఫస్ట్ టైమ్ నా అభిమాన కథానాయకుడు రామారావు తమ్ముడిగా నటించే అవకాశం లభించింది. 'స్త్రీ జన్మ' తర్వాత 'నిలువు దోపిడి'. 'విచిత్ర కుటుంబం' మూడు పిక్చర్లు హిట్టయ్యాయి. ఆ తర్వాత 'పండంటి కాపురం' 100 డేస్‌కు ఫంక్షన్‌కు వచ్చిన రామారావుగారు వచ్చారు.

    ఆ సమయంలో నేను స్టేజీపైనే నా నెక్ట్స్ పిక్చర్ రామారావుగారితో తీయాలని ఉందని అనౌన్స్ చేశాను. వారు కూడా స్టేజీమీదే బ్రదర్ పిక్చర్లో యాక్ట్ చేస్తాను, సబ్జెక్ట్ చూసుకోండి అని చెప్పారు. ఆ తర్వాత దేవుడు చేసిన మనుషులు సబ్జెక్ట్ వారికి వినిపిస్తే చాలా బావుందని ఒకే షెడ్యూల్ లో పూర్తి చేశారు. ఆ చిత్రం అఖండ విజయం సాధించింది. రామారావుగారితో అన్ని పిక్చర్లు నేను తమ్ముడిగానే చేశాను.

    Super star Krishna speech at NTR Biopic Audio Launch

    బాలకృష్ణ మొన్న వచ్చి ఈ సినిమాలో ఆయన వేసిన గెటప్‌లు చూపించారు. వందశాతం రామారావుగారి మాదిరిగానే కనిపించారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం అద్భుత విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

    ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆడియో, ట్రైల‌ర్ లాంఛ్ వేడుక‌లు శుక్రవారం (డిసెంబ‌ర్ 21) గ్రాండ్‌గా ఫిల్మ్ న‌గ‌ర్ లోని JRC క‌న్వెన్ష‌న్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ కుటుంబంతో పాటు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులందరూ హాజరయ్యారు.

    నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగ‌ర్ల‌మూడి తెర‌కెక్కిస్తున్నారు. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా మాట‌లు అందించారు.

    English summary
    NTR kathanayakudu traile released by NTR 4 daughters. The audio and trailer launch event of ‘NTR’ biopic is held on December 21st at JRC Convention in Filmnagar, Hyderabad. Starring Nandamuri Balakrishna, Vidya Balan in the lead roles, the film is being directed by Krish Jagarlamudi. MM Keeravani has composed music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X