సంచలనం.. ఐదు గెటప్పుల్లో మహేష్ విశ్వరూపం.. ప్రతి అరగంటకి మారిపోయేలా!
Recommended Video

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మహేష్ కోసం రెండేళ్ల పాటు ఎదురుచూసిన వంశీ తిరుగులేని కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే మహర్షి చిత్ర యుఎస్ షెడ్యూల్ పూర్తయింది. సినిమా షూటింగ్ జరుగుతున్నకొద్ది ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట ఈ చిత్రంలో మహేష్ స్టూడెంట్ గా కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే డెహ్రా డూన్ లో మహేష్ పూజ హెగ్డే పై కాలేజీ సన్నివేశాలు చిత్రీకరించారు. మహర్షి చిత్రంలో మహేష్ పాత్ర గురించి వస్తున్న వార్తలు అంచనాలు భారీగా పెంచేలా ఉన్నాయి.

మునుపెన్నడూ లేనివిధంగా
సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి, అతిథి చిత్రాల్లో డిఫెరెంట్ గెటప్ లో కనిపించాడు. ఆ తరువాత దాదాపుగా అన్ని చిత్రాల్లో ఒకేలా కనిపించాడు. కానీ మహర్షి చిత్రంలో మహేష్ లుక్ కోసం వంశీ పైడిపల్లి ప్రత్యేక శ్రద్ద పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లో గడ్డం, మీసాలతో మహేష్ అలరిస్తున్నాడు.

మహేష్ విశ్వరూపం
ఈ చిత్రంలో మహేష్ బాబు ఐదు విభిన్న రూపాల్లో నట విశ్వరూపం ప్రదరించబోతున్నాడని సమాచారం. కాలేజీ రోజుల నుంచి మొదలు పెడితే కంపెనీ అధినేతగా ఎదిగేవరకు మహేష్ విభిన్నమైన లుక్స్ లో అమరిస్తాడట. దీనికి సంబంధించిన వార్తలు వైరల్ గా మారాయి.

ప్రతి అరగంటకి
కథలో చోటు చేసుకునే పరిణామాల వలన మహేష్ లుక్ ప్రతి అరగంటకు మారిపోయే విధంగా ఉంటుందట. ఇప్పటికే స్టూడెంట్ గా ఉన్న లుక్ ని ఫస్ట్ లుక్ రూపంలో విడుదల చేశారు. చిత్ర ప్రచార కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడు మిగిలిన లుక్స్ కూడా విడుదల చేస్తారట.

సేంద్రియ వ్యవసాయం
ఈ చిత్ర కథ గురించి మరో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. అమెరికా నుంచి పల్లెటూరికి వచ్చి రైతులకు సేంద్రియ వ్యవసాయంలో మెళుకువలు నేర్పించే సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగర శివారులో భారీ విలేజ్ సెట్ నిర్మించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











