మహేష్ బాబుతో ఏలియన్ మూవీ.. 100కోట్లతో ప్లాన్.. ఆ దెబ్బతో క్యాన్సిల్!

మహేష్ బాబు ఒకప్పుడు కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మకమైన సినిమాలు చాలానే చేసేవారు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా తండ్రి బాటలోనే సరికొత్త అంశాలను టచ్ చేయడానికి ఇష్టపడేవారు. కానీ కొన్ని ప్లాప్స్ వచ్చిన అనంతరం ఎక్కువగా రిస్క్ చేయకూడదని అనుకున్నాడు. అయితే ఒకప్పుడు మహేష్ బాబు ఒక టాలెంటెడ్ రైటర్ ఏకంగా ఏలియన్ పాయింట్ తో ఒక కొత్త తరహా కథను రాసుకున్నాడట.

అందానికి అందంగా ఈ పుత్తడి బొమ్మ... ప్రియా భవానీ శంకర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ

 సమయం చాలానే పట్టింది

సమయం చాలానే పట్టింది

మహేష్ బాబు కెరీర్ లో మొదటి బాక్సాఫీస్ హిట్టు అందుకోవడానికి సమయం చాలానే పట్టింది. ఒక్కడు సినిమాతోనే మహేష్ స్థాయి ఒక్కసారిగా మారిపోయింది. ఇక అంతకుముందు మురారి అనే ప్రయోగాత్మకమైన సినిమాను చేసి కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్నాడు.

ఆ దెబ్బతో రిస్క్ చేయకూడదని

ఆ దెబ్బతో రిస్క్ చేయకూడదని

రొటీన్ గా కాకుండా అప్పట్లో కొత్తగా ట్రై చేయాలని అనుకున్న అతికొద్ది మంది హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఇక సూపర్ స్టార్ బ్రాండ్ వచ్చిన అనంతరం మహేష్ బాబు నాని అనే ఒక సైన్స్ ఫిక్షన్ కథను టచ్ చేశాడు. ఆ సినిమా విడుదలకు ముందు అప్పట్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. కానీ విడుదల అనంతరం డిజాస్టర్ అయ్యింది. ఆ దెబ్బతో మహేష్ ఎక్కువగా అలాంటి ప్రయోగాలు చేయవద్దని అనుకున్నడు.

కోడి రామకృష్ణ వద్దకు ఏలియన్ కథ

కోడి రామకృష్ణ వద్దకు ఏలియన్ కథ

మహేష్ బాబు ఒప్పుకుంటే అలాంటి ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు రెడీగా ఉన్నారు. మహేష్ కూడా దర్శకుడు నమ్మకంతో చేయగలడు అనిపించి, స్క్రిప్ట్ తో మెప్పించగలిగితే చేసేస్తారు. ఇక అప్పట్లో కోడి రామకృష్ణ వద్దకి ఒక ఏలియన్ కాన్సెప్ట్ తో కథ వచ్చిందట.

ఆ టాలెంటెడ్ రైటర్ రాసిన కథ..

ఆ టాలెంటెడ్ రైటర్ రాసిన కథ..

ఢమరుకం కథ రాసిన రైటర్ వెలిగొండ శ్రీనివాస్ మహేష్ కోసం ఏలియన్ కాన్సెప్ట్ లో ఒక కథను రాసుకున్నాడట. ఆ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పట్లో అరుంధతి లాంటి హిట్స్ తీసిన కోడి రామకృష్ణకు కూడా ఆ కాన్సెప్ట్ లైన్ వినిపించారట. ఆయన కూడా చాలా బావుందని ఫుల్ కథను డెవలప్ చేయమని చెప్పారట.

ఆ సినిమా ప్లాప్ అవ్వడం వలన

ఆ సినిమా ప్లాప్ అవ్వడం వలన

పదేళ్ల క్రితమే ఆ సినిమా కథకు దాదాపు 100కోట్లు అయ్యే అవకాశం ఉండేదని అయితే దానికంటే ముందు మరొక సినిమా హిట్టయితే ఫోకస్ చేద్దామని అనుకున్నట్లు శ్రీనివాస్ చెప్పాడు. ఆ కాన్ఫిడెన్స్ తో రాసిన కథే 'అఖిల్' అంటూ.. ఆ సినిమా ప్లాప్ అవ్వడం వలన ధైర్యం చేయలేకపోయినట్లు చెప్పాడు. అప్పుడే ఆ కథను కూడా పక్కన పెట్టేసి మళ్ళీ ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని డిసైస్ అయినట్లు వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X