Sitara Birthday Special: మహేశ్​లానే సితార.. మొన్న ఛారిటీ కోసం రూ.కోటి.. ఇప్పుడేమో ఏకంగా ఆ అమ్మాయిల కోసం..

సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రత గారాల పట్టి సితార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్టార్ డాటర్ అయినప్పటికీ... తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చుకుంది ఈ లిటిల్ ప్రిన్సెస్. సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఈ స్టార్ కిడ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తన గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

పాపులారిటీ: సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రత గారాలపట్టి సితార.. సినిమాల్లో ఎంట్రీ ఇవ్వకపోయినా.. స్టార్ స్టేటస్ మాత్రం సంపాదించుకుంది. తనకున్న ప్రత్యేకతలు, నైపుణ్యాలతో చిన్న వయసులోనే స్టార్‌డమ్‌ ను కైవసం చేసుకుంది. ఇప్పటికే కూచిపూడి డ్యాన్సర్ గా, సోషల్‌ మీడియా స్టార్‌ గా ప్రపంచమంతా పాపులారిటీ సంపాదించిన ఈ లిటిల్‌ ప్రిన్సెస్‌.. ఇప్పుడు మరో ఘనతను సొంతం చేసుకుంది.

Super star Mahesh Babu Daughter Sitara Birthday Special Story

మహేశ్ లానే మంచి మనసు: ఇటీవల ప్రముఖ జ్యుయలరీ యాడ్‌లో సితార నటించింది. ఆ సంస్థ తాజాగా ప్రతిష్టాత్మక న్యూయార్క్‌ 'టైమ్స్‌ స్క్వేర్‌'పై ప్రదర్శించింది కూడా. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి స్టార్‌ కిడ్‌గా పేరు సంపాదించుకుందీ క్యూట్‌ గర్ల్‌. ఇక ఈ యాడ్ నిన్ననే రిలీజ్ అయింది. దానికి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక మహేశ్ లానే సితార కూడా మంచి మనసు అనిపించుకుంది. ఈ యాడ్ ద్వారా వచ్చిన రెమ్యూనరేషన్ ను ఛారిటీకి ఇచ్చేసింది.

Super star Mahesh Babu Daughter Sitara Birthday Special Story

ఫౌండేషన్ అమ్మాయిలతో: ఇక ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా మరోసారి తన పెద్ద మనసును చాటుకుంది. సాధారణంగా స్టార్‌ కిడ్స్‌ పుట్టిన రోజు అంటే హంగులు, ఆర్భాటాలు, కేక్‌ కటింగులు, పార్టీలు గట్రా చాలా ఉంటాయి. అయితే మహేష్‌ అడుగుజాడల్లో నడుస్తోన్న సితార సింపుల్‌ గా తన పుట్టిన రోజు సెలబ్రేట్‌ చేసుకుంది. మహేష్‌ బాబు ఫౌండేషన్‌లోని అమ్మాయిలతో కలిసి కేట్‌ కట్‌ చేసిన సితార వారందరికీ ప్రేమతో కేక్‌ తినిపించింది.

Super star Mahesh Babu Daughter Sitara Birthday Special Story

సైకిళ్లు గిఫ్ట్ గా: ఇక ఈ లిటిల్ ప్రిన్సెస్ వారితో ప్రేమగా మాట్లాడి.. అక్కడున్న అమ్మాయిలందరికీ సైకిళ్లను బహుమతిగా ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను నమ్రత సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 'ఇప్పుడు ఆ బాలికలు ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వారందరికీ స్కూల్‌ కేవలం సైకిల్‌ దూరంలో మాత్రమే ఉంది. నీలో ఇతరులపై అమితమైన ప్రేమను చూపించే గొప్ప మనసు ఉంది. నీ అద్భుతమైన జీవితంలో ఇలాంటి అర్థవంతమైన మధుర జ్ఞాపకాలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్‌ డే సితార' అని తన కూతురికి బర్త్‌ డే విషెస్‌ చెప్పుకొచ్చింది.

Super star Mahesh Babu Daughter Sitara Birthday Special Story

మహేశ్ విషెష్: ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు మహేష్‌ కూతురు పెద్ద మనసును ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే తను మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. కాగా తన కూతురికి సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌ డే విషెస్‌ చెప్పాడు మహేష్‌. '11వ పడిలోకి అడుగు పెట్టిన నా చిన్నారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నా ప్రపంచంలో నువ్వే స్టార్‌వి. నువ్వు దేన్నైనా సాధించగలవు' అని మహేష్‌ విషెస్‌ చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X