సితార యాడ్ రిలీజ్.. అచ్చం ప్రిన్సెస్‌లా.. ఎంత అందంగా ఉందో.. వీడియో చూశారా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార రీసెంట్ గా ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఓ కమర్షియల్ యాడ్ లోనూ నటించింది. తాజాగా ఆ యాడ్ కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. మీరు చూశారాా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు - నమ్రత ముద్దుల కూతురు సితార. ఈ చిన్నారి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఫోటోలు, రీల్స్, డ్యాన్స్ వీడియోలంటూ నెట్టింట్లో షేర్ చేస్తూ మహేశ్ అభిమానుల్ని, నెటిజన్లను ఆకట్టుకుంటుంది. మల్టీటాలెంటెడ్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

Super Star Mahesh Babu Daughter Sitara Gattamaneni Jewellery ad video released and viral in social media

న్యూయార్క్ టైమ్ స్క్వేర్స్ బోర్డుపై: ఇకపోతే ఇటీవలే సితార పాప ఓ ఇంటర్నేషనల్ జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. PMJ జ్యువెలరీస్ కోసం ఓ యాడ్ ఫొటోషూట్ కూడా ఇచ్చింది. ఆ ప్రముఖ సంస్థకు చెందిన జ్యువెలరీని ధరించి సితార ఇచ్చిన పోజులు ఏకంగా ప్రముఖ న్యూయార్క్ టైమ్ స్క్వేర్స్ బోర్డుపై ప్రదర్శించారు.

అవి నెట్టింట్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. మహేశ్ బాబు, అలాగే ఆయన అభిమానులు వీటిని చూసి తెగ మురిసిపోయారు. సితార పాప తండ్రిని మించిపోయిందంటూ ప్రశంసలు కురిపించారు. మహేశ్ బాబు అయితే కూతుర్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందంటూ మురిసిపోయాడు.

Super Star Mahesh Babu Daughter Sitara Gattamaneni Jewellery ad video released and viral in social media

యాడ్ సూపర్: తాజాగా సితార పాప నటించిన జ్యువెలర్స్ యాడ్ రిలీజ్ అయింది. ఇందులో సితార ప్రిన్సెస్ లా మెరిసిపోయింది. ఈ ప్రచార చిత్రాన్ని చాలా కొత్తగా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఈ యాడ్ వీడియోను మహేశ్ .. తన సోషల్ మీడియాలో షేర్ చేసి మరోసారి మురిసిపోయారు. వీడియోలో.. అమెరికా నుంచి తన ఓణీల ఫంక్షన్ కోసం తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వస్తుంది సితార. అయితే సితార మూడీగా ఉన్నట్లు గమనించిన అమ్మమ్మ.. నిన్ను ఒక చోటుకు తీసుకెళ్తాను. అక్కడ వాళ్ళు నిన్ను ప్రిన్సెస్ లా చూసుకుంటారు అని చెబుతూ.. జ్యువెలర్స్ కు తీసుకెళ్లి సర్ ప్రైజ్ చేస్తుంది.

అయితే నగలను చూసి.. 'అమ్మమ్మ ఇదంతా అవసరమా?' అని సితార అంటుంది. ఆ తర్వాత షాప్ సేల్స్ మెన్.. ఒకసారి అక్కడికి వెళ్లి చూడు ఏముందో అని చెబుతాడు. దీంతో సితార ఓ పెద్ద గదిలోకి వెళ్తుంది. అక్కడి వెళ్లగానే తనను తాను నగలు ధరించిన ఓ క్వీన్ లాగా ఊహల్లో తేలిపోతుంది సితార. ఆ తర్వాత ఆ నగలు వేసుకుని తన ఓణీల ఫంక్షన్ ఎంతో సంతోషంగా జరుపుకుంటుంది. వీడియో ముగుస్తుంది.

Super Star Mahesh Babu Daughter Sitara Gattamaneni Jewellery ad video released and viral in social media

అచ్చం మహారాణిలా: ఈ ప్రకటనలో సితార తన క్యూట్ లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా నగలు ధరించినప్పుడు అచ్చం ప్రిన్సెస్ లా కనిపించింది. ఇక ఈ వీడియో చూసిన మహేశ్ ఎంతగానో సంతోషపడిపోయారు. అలాగే ఫ్యాన్స్ కూడా మురిసిపోయారు. సితార ఎంతో అందంగా ఉందని, అచ్చం మహారాణిలా ఉందని అంటూ ప్రశంసలు కురిపించేశారు.

ఛారిటీకి రెమ్యునరేషన్: ఇకపోతే ఈ యాడ్ కోసం సితార సుమారు రూ.70 నుంచి కోటి రూపాయల వరకు పారితోషికం తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై సితార కూడా మాట్లాడింది. కానీ ఎంత తీసుకుందో చెప్పలేదు. అయితే తాను అందుకున్న మొత్తాన్ని ఓ ఛారిటీ కోసం ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు.. సామాజిక సేవలోనూ తండ్రిని మించిపోయిందని కొనియాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X