మహేష్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్న ఫొటో ఇదే... తండ్రీ కొడుకూ ఇలా
మహేష్ బాబు, అయన కుమారుడు గౌతం కృష్ణ కలిసి నడుస్తున్న ఫొటో బాగా వైరల్ అయ్యింది ఎందుకంటే....
అప్పుడే మహేష్ బాబు కొడుకు గౌతమ్ అంత ఎదిగిపోయాడా? అనే డౌట్ మాత్రం వద్దు. మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియాలో గౌతమ్ కు సంబంధించిన ఓ ఫోటో సరదాగా పోస్టు చేయగా..దాన్ని చూసి 'మహేష్ బాబు అభిమానులు' చేస్తున్న కామెంట్ ఇది. మహేష్ బాబు ఫ్యామిలీ, వాళ్ల బావ గల్ల జయదేవ్ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు హాలిడే వెళ్లిన సంగతి తెలిసిందే. క్రిస్ మస్, న్యూఇయర్ అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు. నమ్రత ఇందుకు సంబంధించిన ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేసారు. వీటిల్లో ఒక ఫొటో ఇప్పుడు పిచ్చి పిచ్చి గా పాపులర్ అయిపోయింది... అసలు గౌతం ఇంతగా ఎప్పుడు మారిపోయాడు అన్నది అర్థం కానేలేదు...
నిన్న మొన్నటివరకు పాల బుగ్గలతో ముద్దుముద్దుగా కనిపిస్తూ - తనలో తానే సిగ్గు పడిపోతూ తండ్రితో కలిసి ఆడియో వేడుకల్లో కనిపించిన గౌతమ్ కృష్ణ ఇప్పుడు దగ్గరదగ్గరగా మహేష్ అంత హైట్ పెరిగాడు. స్టైల్ లోనూ - నడవడికలోనూ మహేష్ కి ఏమాత్రం తగ్గడం లేదు. అది చూసి మహేష్ కూడా పుత్రోత్సాహంతో పొంగి పోతున్నాడు. ఎలాగో గౌతమ్ ముఖ కవళికలు అచ్చం మహేష్ బాబునే పోలి వుంటాయి.

ఇప్పుడు ఆయన స్టైల్ కూడా మహేష్ నే పోలి వుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇదిగో ఇలాంటి ఫొటోలు చూసినప్పుడు ఆ ఆనందం రెట్టింపవుతుంటుంది. గౌతమ్ చిన్నప్పట్నుంచి తండ్రి చాటు బిడ్డగా ఎదిగాడు. మహేష్ ఎక్కడికెళ్లినా ఆయనతో పాటు గౌతమ్ కూడా వెళుతుంటాడు. ఇటీవల న్యూ ఇయర్ వేడుకల కోసం మహేష్ కుటుంబం విదేశాలు వెళ్లింది. అక్కడే మహేష్ - గౌతమ్ లు సేమ్ స్టైల్ తో నడుస్తున్నప్పుడు ఈ ఫొటో క్లిక్మనిపించారు. ఇప్పుడు అభిమానులు ఈ ఫొటోని ఆన్ లైన్ లో షేర్ చేస్తుండడంతో వైరల్ అవుతోంది. ఒకసారి ఆ ఫొటో మీరూ చూడండి


Click it and Unblock the Notifications











