మహేష్‌బాబు మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. ఏప్రిల్ 5న..
Recommended Video

భరత్ అనే నేను చిత్రం తర్వాత సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శకుడు వంశీ పైడిపెల్లి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఉగాది పండుగ నేపథ్యంలో ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.
ప్రస్తుతం డెహ్రాడూన్‌లో షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖారారు చేయలేదు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, అల్లరి నరేష్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మహేష్, నరేష్ స్నేహితులుగా కనిపించనున్నారు. రైతు ఆత్మహత్యల నేపథ్యంగా తెరకెక్కుతున్నట్టు మీడియాలో ప్రచారమవుతున్నది.

డెహ్రాడూన్‌లోని ఓ కాలేజీలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో ఐఐటీ స్టూడెంట్‌గా కూడా ప్రిన్స్ కనిపించనున్నట్టు సమాచారం. దాదాపు నెల రోజులు అక్కడే షూట్ జరగనున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











