ఫోటోలు: ఇంటర్నెట్‌ని దున్నేస్తున్న మహేష్ కొత్త లుక్.. గడ్డం, మీసాలు అదుర్స్!
Recommended Video

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రం తరువాత రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళాడు. ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతున్నాడు. మహేష్ కుటుంబం వెకేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. మహేష్ కొత్త సినిమా ప్రారంభం అయ్యే సమయం దగ్గర పడింది. భరత్ అనే నేను చిత్రం ఘనవిజయం తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటించబోతున్నాడు. మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది.

కనిపించి కనిపించకుండా
ఇటీవల మహేష్ ఫోటోని నమ్రత కనిపించి కనిపించకుండా పోస్ట్ చేసింది. ఆ పిక్ లో మహేష్ గడ్డంతో ఉన్నట్లు అర్థం అయింది. మహేష్ ఈ చిత్రంలో అదిరిపోయే లుక్ లో కనిపించబోతున్నాడని ఫాన్స్ హంగామా మొదలు పెట్టేశారు.

గడ్డంలో మెరిసిన సూపర్ స్టార్
తాజగా మహేష్ బాబు విమానాశ్రయం నుంచి వస్తుండగా మీడియా తమ కెమెరాలకు పని చెప్పింది. మహేష్ బాబు అదిరిపోయే గడ్డం లుక్ లో కనిపిస్తున్నాడు. క్షణాల్లో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మొట్టమొదటిసారి
మహేష్ బాబు ఇలా గడ్డం మీసాలతో కనిపించడం ఇదే తొలి సారి అని చెప్పొచ్చు. ఏ చిత్రంలోనూ మహేష్ బాబు గడ్డంతో కనిపించలేదు. స్టైలిష్ గా ట్రిమ్ చేసిన లుక్ లోనే మహేష్ ఎప్పుడూ కనిపిస్తూ వచ్చాడు.

పోకిరి, అతిథి
మహెష్ బాబు లుక్ విషయంలో కొత్తగా ట్రై చేసిన చిత్రాలు అంటే పోకిరి, అతిథి చిత్రాల గురించే చెప్పుకోవాలి. ఆ రెండు చిత్రాల్లో మహేష్ బాబు కొంచెం పొడవాటి హెయిర్ తో కనిపిస్తాడు.

ఇద్దరు బడా నిర్మాతలతో
మహేష్ బాబు 25 వ చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. దిల్ రాజు, అశ్వినీదత్ వంటి ఇద్దరు బడా నిర్మాతల నిర్మాణంలో ఈ చిత్రం రాబోతోంది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











