Kalki 2898 AD: ప్రభాస్ మూవీని చూసిన మహేశ్ బాబు.. ఏమని రివ్యూ ఇచ్చాడంటే!

సాధారణంగా ప్రతి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్నో రకాల జోనర్లలో డిఫరెంట్ మూవీలు వస్తుంటాయి. అందులో స్టార్ హీరోలు నటించే చిత్రాలకు ఎక్కువ హైప్ క్రియేట్ అవుతుంది. అలాంటిది ఈ మధ్య కాలంలో టాలీవుడ్ నుంచి వచ్చే చిత్రాలకు దేశ వ్యాప్తంగా బజ్ వస్తోంది. ఇలా ఈ మధ్య కాలంలో చాలా సినిమాలే వచ్చి సెన్సేషన్ అయ్యాయి. అలా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'కల్కి 2898 ఏడీ'. రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా రివ్యూ ఇచ్చాడు. ఇంతకీ అతడు ఏం చెప్పాడో మీరే చూసేయండి!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రమే 'కల్కి 2898 ఏడీ'. టైం ట్రావెల్ స్టోరీతో హాలీవుడ్ రేంజ్‌లో రూపొందిన ఈ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హై రేంజ్‌లో తీశారు. ఈ క్రమంలోనే జూన్ 27వ తేదీన ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Super Star Mahesh Babu Review on Prabhas Starrer Kalki 2898 AD Movie


మల్టీస్టారర్ జోనర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఫలితంగా ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. ఇలా ఇప్పటికే రూ. 900 కోట్లకు పైగా గ్రాస్‌ను సైతం వసూలు చేసింది. అదే సమయంలో హిట్ స్టేటస్‌ను సైతం సొంతం చేసుకుంది.

హాలీవుడ్ రేంజ్ కాన్సెప్టుతో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా ఉన్న చాలా మంది స్టార్లు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఈ మూవీపై తన రివ్యూను చెబుతూ X ఖాతాలో ట్వీట్ చేశాడు.


మహేశ్ బాబు తాజాగా X ఖాతాలో 'కల్కి మూవీ చూసి నా మైండ్ బ్లాక్ అయింది. జస్ట్ వావ్.. నాగ్ అశ్విన్ ఫ్యూచర్ విజన్‌కు హ్యాట్సాఫ్. ప్రతీ ఫ్రేమ్ ఓ ఆర్ట్‌లానే ఉంది' అని ఓ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత వరుసగా 'అమితాబ్ సార్ స్క్రీన్ ప్రజెన్స్ ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. కమల్ హాసన్ సార్ ప్రతీ కారెక్టర్‌ను ఎంతో యూనిక్‌గా చేస్తారు. ప్రభాస్ ఖాతాలో మరో అద్భుతమైన సినిమా పడింది. ఇందులో ఎంతో ఈజ్‌తో నటించాడు. దీపిక సూపర్‌గా చేసింది. ఇంతటి భారీ విజయాన్ని దక్కించుకున్న వైజయంతీ మూవీస్‌కు కంగ్రాట్స్' అంటూ చెప్పాడు. దీనిపై చిత్ర యూనిట్ ఖుషీ అవుతూ.. మహేశ్‌కు ధన్యవాదాలు తెలుపుతోంది.

ఇదిలా ఉండగా.. హై రేంజ్ బడ్జెట్‌తో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించింది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్‌ను కంపోజ్ చేశాడు.

More from Filmibeat

Read more about: kalki 2898 ad prabhas mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X