షాకింగ్ : దుబాయ్ నుంచి రావడంతో కరోనా బారిన మహేష్ బాబు.. వారందరిలో టెన్షన్!
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ లో చాలా మంది కరోనా బారిన పడగా ఇప్పుడు టాలీవుడ్ లో కూడా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే టాలీవుడ్ నుంచి కరోనా బారిన పడిన వారు కోరుకుంటూ ఉండగా తాజాగా మహేష్ బాబు కరోనా బారిన పడ్డాడు. వివరాల్లోకి వెళితే

ఏప్రిల్ నెలకు వాయిదా
చివరిగా సరిలేరు నీకెవ్వరు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది కానీ రాజమౌళి RRR సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం కోసం రాజమౌళి మహేష్ బాబు సహా సినిమా టీం మొత్తాన్ని సంప్రదించడంతో ఈ సినిమాని ఏప్రిల్ నెలకు వాయిదా వేశారు.

కాలి నొప్పితో బాధపడుతూ
దీంతో కాస్త సమయం దొరకడంతో మహేష్ బాబు చాలా కాలంగా తన కాలి నొప్పితో బాధపడుతున్న క్రమంలో దానికి సర్జరీ చేయించుకున్నారు. కాలు నొప్పి తో బాధపడుతున్న ఆయన స్పెయిన్లో సర్జరీ చేయించుకుని దుబాయ్ లో తన వదిన ఇంట్లో రెస్ట్ తీసుకోవడం కోసం కుటుంబంతో సహా దుబాయ్ వెళ్లారు. కొంత కాలం పాటు దుబాయ్ లోనే ఉండి క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు అక్కడే జరుపుకున్న మహేష్ బాబు కుటుంబం తాజాగా హైదరాబాద్ కు వచ్చింది.
పాజిటివ్
ఇక మిగిలి పోయిన సర్కారు వారి పాట సినిమా షూటింగ్ మొదలు పెట్టాలి అని భావిస్తున్న తరుణంలో మహేష్ బాబుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో తాజాగా ఆ విషయాన్ని ఆయన సోషల్మీడియా వేదికగా ప్రకటించారు. నా అభిమానులు మరియు శ్రేయోభిలాషులందరికీ, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, నేను తేలికపాటి లక్షణాలతో COVID-19కి పాజిటివ్ అని తేలింది. నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను మరియు వైద్య మార్గదర్శకాలు అనుసరిస్తున్నాను.

టీకా తీసుకోని ప్రతి ఒక్కరినీ
నన్ను కొద్ది రోజులుగా కాంటాక్ట్ అయినా అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవలసిందిగా అభ్యర్థిస్తున్నాను, టీకా తీసుకోని ప్రతి ఒక్కరినీ వెంటనే తీసుకోమని నేను కోరుతున్నాను, ఎందుకంటే ఇది తీవ్రమైన లక్షణాలు మరియు ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దయచేసి COVID నిబంధనలను అనుసరించండి మరియు సురక్షితంగా ఉండండి, వెనక్కు రావడానికి ఎక్కువ కాలం వేచి చూడలేకపోతున్నాను అని ఆయన పేర్కొన్నారు. అయితే ఆయనని కొద్ది రోజుల క్రితమే త్రివిక్రమ్, నాగవంశీ, తమన్ దుబాయ్ లో మహేష్ ను కలిసి రావడంతో వారిలో టెన్షన్ నెలకొందని అంటున్నారు.

ప్యాచ్ వర్క్ అంతా
ప్లాన్ చేసిన దాని ప్రకారం సర్కారు వారి పాట టీమ్ మిగిలిన సన్నివేశాలు, షెడ్యూల్‌లను రెండు నెలల్లో అంటే జనవరి, ఫిబ్రవరిలో షూట్ చేయాలని అనుకున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానున్నందున, కోవిడ్ వేరియంట్ కారణంగా మరింత నష్టపోయే ముందు మిగిలిన ప్యాచ్ వర్క్ అంతా వేగంగా చిత్రీకరించాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. సంక్రాంతికి ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కూడా రానుందని టీమ్ ప్రకటించిన రోజే మహేష్ కరోనా బారిన పడ్డారు. సంక్రాంతి నుండి నిరంతరం అప్‌డేట్‌లు ఇస్తామని సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ చెబుతోంది.


Click it and Unblock the Notifications











