Mahesh Babu: పోకిరి తర్వాత మళ్లీ ఇప్పటికి మాస్ లుక్కులో మిల్క్ బాయ్.. బీడీ తాగుతూ రచ్చ!
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న తాజా చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల, మీనాక్షి చౌదరిలు కథానాయికలుగా కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే దసరా పండుగ సందర్భంగా ఓ అద్భుతమైన ట్రీట్ ఇచ్చారు.
గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు ఎలా ఉండబోతున్నారో చూపిస్తూ.. ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ను ఈరోజు విడుదల చేశారు. అందులో మహేష్ బాబును చూస్తే కచ్చితంగా అభిమానులు అంతా షాకైపోతారు. ఎందుకూ అనుకుంటున్నారా.. ఈ సినిమాలో మిల్క్ బాయ్ మాస్ లుక్కులో కనిపించబోతున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన బీడీ తాగుతూ కనిపించారు. ముఖ్యంగా రౌడీలతో ఫైట్ చేసిన తర్వాత కాస్త రిలాక్స్ అయ్యేందుకు బీడీ వెలిగించి... కారు డిక్కీ తెరిచి అక్కడ కూర్చున్నారు. ఇందులో మహేష్ బాబు నిజంగా చాలా అందంగా కనిపిస్తున్నాడు.

గుంటూరు కారం సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలైన కాసేపటికే నెట్టింట వైరల్ గా మారింది. మహేష్ బాబు చివరగా పోకిరి సినిమాలో మాస్ లుక్ లో కనిపించారు. ఇక ఆ తర్వాత ఏ సినిమాలోనూ ఆయన ఇలా దర్శనం ఇవ్వలేదు. 2006లో వచ్చి పోకిరి చిత్రంలో సిగరెట్ పట్టుకున్న మహేషష్ బాబు.. మళ్లీ 17 ఏళ్ల తర్వాత గుంటూరు కారం సినిమాలో బీడీ చేత పట్టుకున్నారు. మధ్యలో వచ్చిన ఏ సినిమాలోనూ ఆయన ధూమపానాన్ని టచ్ చేయలేదు. గుంటూరు నేపథ్యంలో నడిచే కథ కావడంతో మాస్ అప్పీల్ ఉంటేనే బాగుంటుందని... అందుకే ఇలా మహేష్ బాబుతో త్రివిక్రమ్ బీడీ కాల్పించినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చాయి. అతడు, ఖలేజా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టు నిలవగా.. ఇప్పుడు రాబోయే గుంటూరు కారం కచ్చితంగా హ్యాట్రిక్ గా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరో జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరాం, బ్రహ్మానందం, రేఖ, సునీల్ లు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.

అయితే త్వరలోనే గుంటూరు కారం సినిమాకు సంబంధించిన తొలి పాటను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అలాగే 11 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందించగా, నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధా కృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











