కౌశల్‌కు సూపర్ స్టార్ మహేష్ సర్‌ప్రైజ్.. క్రేజీగా మారుతున్న బిగ్ బాస్ విన్నర్!
Recommended Video

బిగ్ బాస్2 విజేత కౌశల్ ప్రస్తుతం క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయాడు. కౌశల్ ఆర్మీ అంటూ అతడికి ప్రత్యేకంగా అభిమానులు ఏర్పడ్డారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎక్కువగా చర్చించుకుంటున్నది కౌశల్ గురించే. 113 రోజులపాటు జరిగిన బిగ్ బాస్ షో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి కౌశల్ విజేతగా నిలిచాడు. ప్రస్తుతం ప్రముఖుల నుంచి కౌశల్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. కౌశల్ ని తమ చిత్రాల్లో నటింపజేసేందుకు టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

మహేష్ ప్రోత్సాహం
బిగ్ బాస్ విజేతగా నిలిచిన తరువాత అభిమానులతో కలసి సంబరాల్లో కౌశల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కౌశల్ సూపర్ స్టార్ మహేష్ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. సొంతంగా మోడలింగ్ అకాడమీ ప్రారంభించిన సమయంలో మహేష్ బాబు ప్రోత్సాహం మరువలేనిది అని కౌశల్ తెలిపాడు.
సూపర్ స్టార్ సర్‌ప్రైజ్
సూపర్ స్టార్ మహేష్ నుంచి ఇది కౌశల్ కు సర్‌ప్రైజ్ అని చెప్పొచ్చు. కౌశల్ ని అభినందిస్తూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచిన కౌశల్ కు శుభాకాంక్షలు. నీవు విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.

టాలీవుడ్‌లో అవకాశాలు
కౌశల్ కు బిగ్ బాస్ తో ఏర్పడ్డ క్రేజ్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. టాలీవడ్ చిత్రాల్లో కూడా కౌశల్ నటుడిగా మరో ఎత్తు ఎదిగే అవకాశాలు ఉన్నాయంటూ చర్చ జరుగుతోంది. పలు చిత్రాల్లో అతడిని నటింపజేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతన్నట్లు వార్తలు వస్తున్నాయి.

క్రేజీ దర్శకులంతా
కౌశల్ బిగ్ బాస్2 విజేతగా నిలవడంతో టాలీవుడ్ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. క్రేజీ దర్శకులు అనిల్ రావిపూడి, మారుతి కౌశల్ ని అభినందించారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో కౌశల్ కామియో రోల్ పోషించబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఈమేరకు వాస్తవం ఉందో తెలిసియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications










