మహేష్ ఫోటో లీక్.. లుక్కు అదిరిపోయింది!
Recommended Video

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మహేష్ ఈ చిత్రంలో సరికొత్త గెటప్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మహెష్ మునుపటికంటే స్టైలిష్ గా యంగ్ గా కనిపిస్తున్నాడు. తాజాగా షూటింగ్ లొకేషన్ నుంచి మరో మహేష్ ఫోటో లీకై వైరల్ గా మారింది.

స్టైల్ అదిరింది
మహేష్ ఈ చిత్రంలో గడ్డంతో కనిపిస్తున్నాడు. తాజగా లీకైన లుక్ లో మహేష్ గడ్డం ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది. గాగుల్స్ ధరించి సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. సామజిక మాధ్యమాల్లో ఈ ఫోటో వైరల్ గా మారింది.

పక్కా ప్రణాళికతో
వంశీ పైడిపల్లి పక్క ప్రణాళికతో మహర్షి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రైతు సమస్యలని హైలైట్ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ పాత్ర కూడా ఈ చిత్రంలో హైలైట్ గా నిలుస్తుందని వార్తలు వస్తున్నాయి.

పూజ హెగ్డే
ఈ చిత్రంలో హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తోంది. మహేష్ సరసన ఆమెకు ఇది తొలి చిత్రం. డీజే చిత్రం తరువాత పూజ హెగ్డే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
భారీ స్థాయిలో
దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 2019 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











