మహేష్ లుక్ మార్చేస్తున్న వంశీ పైడిపల్లి.. ఆశ్చర్యంలో మునిగిపోక తప్పదు!
సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తదుపతి చిత్రాలకు క్రేజీ దర్శకులని ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ 25 వ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అశ్వినీదత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
కాగా ఈ చిత్రంలో మహేష్ లుక్ గురించి ఆసక్తికరణ వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు సహజంగానే అందంగా ఉంటాడు కాబట్టి లుక్ విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయడు. పోకిరి, అతిధి వంటి చిత్రాలలో మాత్రమే మహేష్ లుక్ కొత్తగా కనిపిస్తుంది. కాగా వంశీ పైడి పల్లి చిత్రంలో మహేష్ మీసకట్టుతో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మహేష్ మీసకట్టులో కనిపిస్తే అభిమానులకు సర్ ప్రైజ్ అనే చెప్పొచ్చు. మహేష్ మీసం లుక్ లో ఇంతవరకు కనిపించింది లేదు. భరత్ అనే నేను చిత్రంలో కొద్దీ క్షణాల పాటు మహేష్ మీసంతో కనిపిస్తే థియేటర్స్ హోరెత్తాయి. వంశి పైడి పల్లి చిత్రం తరువాత సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











