వైరల్ పిక్ : మహేష్ గడ్డం లుక్ చూశారా.. నమ్రత ఊరించిందిగా!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25 వ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. భరత్ అనే నేను చిత్ర విజయాన్ని పూర్తిగా ఆస్వాదించిన తరువాత త్వరలో కొత్త చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది. మహేష్ కోసం వంశీ పైడిపల్లి రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాడు.

దిల్ రాజు, అశ్వినీదత్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించబోతున్నారు. జూన్ 10 ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో అల్లరి నరేష్ .. మహేష్ కు స్నేహితుడిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం కోసం మహేష్ సరికొత్త లుక్ లో కనిపిస్తాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.

Super star mahesh new look for 25th film

తాజగా మహేష్ సతీమణి క్లిక్ మనిపించిన ఈ ఫోటో చూస్తే మహెష్ కొత్త లుక్ నిజమే అని అనిపిస్తుంది. తన గారాలపట్టి సితారతో మహేష్ ఉండగా ఓ వైపు నుంచి తీసిన ఫోటో ఇది. ఈ ఫొటోలో మహేష్ గడ్డం క్లియర్ గా కనిపిస్తోంది. కానీ మహేష్ ముఖాన్ని పూర్తిగా రివీల్ చేయకుండా నమ్రత ఊరించింది. పోకిరి చిత్రం తరువాత మహేష్ బాబు ఎప్పుడూ కొత్తగా కనిపించే ప్రయత్నం చేయలేదు. తన 25 వ చిత్రంలో ఎలాంటి లుక్ తో సర్ ప్రైజ్ చేస్తాడో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X