క్లాస్ రూమ్‌లో మహేష్.. కొత్త లుక్ బయటపడిందిగా!
సూపర్ స్టార్ మహేష్ తన 25 వ చిత్ర షూటింగ్ తో బిజీ అయిపోయాడు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్ లోని కళాశాలలో జరుగుతోంది. సూపర్ స్టార్ మహేష్, హాట్ బ్యూటీ పూజా హెగ్డేపై క్లాస్ రూమ్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
షూటింగ్ లొకేషన్ నుంచి మహేష్ బాబు లుక్ బయటకు వచ్చింది. కొత్తగా కనిపించే హెయిర్ స్టైల్, గడ్డం లుక్ లో మహేష్ బాబు కనిపిస్తున్నాడు. దిల్ రాజు, అశ్విని దత్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఊపిరి చిత్రం తరువాత వంశీ పైడిపల్లి మరో చిత్రం చేయలేదు. మహేష్ కోసమే ఎదురుచూశాడు.

అల్లరి నరేష్ ఈ చిత్రంలో మహేష్ స్నేహితుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ కూడా ఉన్నట్లు వినికిడి. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.


Click it and Unblock the Notifications











