»   » మహేష్ బాబు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసారట!

మహేష్ బాబు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసారట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఫాంలో ఉన్న స్టార్ హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్లతో సినిమాలు చేయడానికి నిర్మాతలు, దర్శకులు పోటీ పడుతుంటారు. కొందరు నిర్మాతలైతే సినిమా కమిట్మెంటుకు ముందుగానే అడ్వాన్సులు ఇచ్చి స్టార్ హీరోలను డేట్స్ దక్కించుకుంటారు.

గతంలో అశ్వినీదత్ ఇదే తరహాలో డేట్స్ బుక్ చేసుకున్నారు. కానీ మహేష్ బాబు ఇతర సినిమాలతో బిజీ కావడం, అశ్వినీ దత్ కూడా మహేష్ మెచ్చే కథ తేక పోవడంతో అడ్వాన్స్ తిరిగి ఇచ్చినట్లు టాక్. తాజాగా హారిక - హాసిని బ్యానర్ అధినేత, నిర్మాత రాధాకృష్ణ కూడా మహేష్ బాబుకు రూ. 10 కోట్ల అడ్వాన్స్ ఇచ్చాడని, మహేష్ బాబు సినిమా చేయక పోవడంతో తన అడ్వాన్స్ తిరిగి తీసుకున్నట్లు సమాచారం.

అయితే కొందరు మాత్రం మహేష్ బాబు అడ్వాన్స్ పూర్తిగా తిరిగి ఇవ్వలేదని అంటున్నారు. రాధాకృష్ణ నిర్మాణంలో మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ మూవీ ఎప్పుడైనా ఓకే కావచ్చని అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ నితిన్, సమంతతో ‘అ..ఆ..' సనిమా చేసే ప్రయత్నంలో ఉండగా, మహేష్ బాబు బ్రహ్మోత్సవం మూవీ షూటింగులో బిజీగా ఉన్నారు.

 Super star Mahesh returns advance?

మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా వివరాల్లోకి వెళితే...
మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం'. తెలుగు, త‌మిళ్ లో పి.వి.పి సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు. బంధాలు..అనుబంధాలు నేప‌థ్యంతో విజ‌య‌వాడ బ్యాక్ డ్రాప్ తో రూపొందే ఈ బ్ర‌హ్మోత్స‌వం సినిమా తిరుప‌తిలో జ‌రిగే బ్ర‌హ్మోత్స‌వం స‌న్నివేశంతో శుభం కార్డ్ ప‌డుతుంద‌ని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది.

త్యరాజ్‌, జయసుధ, రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, కూర్పు: శ్రీకర ప్రసాద్‌, కళ: తోట తరణి.

English summary
Film Nagar source said that, Radhakrishna of Harika-Hassine fame also gave an advance of Rs 10 crores to Mahesh. However, since he is unable to do the film, talk is that Radhakrishna has taken back the advance as interest rates get pretty high with time.
Please Wait while comments are loading...