ఘాటుగా ఫైర్ అయిన నమ్రత.. వైరల్ వీడియోపై ఇంటర్నెట్‌లో దుమారం!

Recommended Video

Namrata Fires On Online Food Delivery Company | Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటారు. కానీ ఆమె తన కుటుంబ విషయాలు మినహా మిగిలిన విషయాలని పెద్దగా పట్టించుకోరు. తాజాగా నమ్రత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై ఘాటుగా స్పందించారు. ఆ వీడియో చూసి తాను షాక్ అయ్యానని నమ్రత తెలిపారు. ఇది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జుమాటోకి సంబంధించిన వీడియో. కేవలం నమ్రత మాత్రమే కాదు.. సదరు సంస్థ చేసిన నిర్వాకానికి నెటిజన్లు అంతా దుమ్మెత్తిపోస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియో

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాని ఓ వీడియో దున్నేస్తోంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జుమాటో డెలివరీ బాయ్ చేసిన పనికి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ డెలివరీ చేసే క్రమంలో మార్గమధ్యమం లోనే అన్ని ఆహారపదార్థాల పార్సిల్స్ ని ఓపెన్ చేసి ఆరగించేస్తున్నాడు. కొంచెం కొంచెం తిని అనుమానం రాకుండా తిరిగి ప్యాక్ చేస్తున్నాడు. అక్కడున్న సిసి టివిలో ఈ వీడియో రికార్డ్ కావడంతో వైరల్ అయింది. ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే భపడే స్థాయికి వీరి సర్వీస్ దిగజారిందని మండి పడుతున్నారు.

నమ్రత ఘాటుగా

నమ్రత ఘాటుగా

ఈ వీడియోపై నమ్రత కూడా ఘాటుగా స్పందించారు. పేరున్న సంస్థలే ఇలాంటి పనులకు పాల్పడడం షాక్ కి గురిచేసే అంశం. ఫుడ్ డెలివరీ చేసే వాళ్లకు కనీసం విలువలు లేవా అంటూ నమ్రత ప్రశ్నించారు. ఇలాంటి పనుల వలన ఆన్లైన్ లో పుడ్ ఆర్డర్ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇకపై నా పిల్లలు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తానంటే ఏమాత్రం ఒప్పుకోను. మీరు కూడా ఆన్లైన్ ఫుడ్ మానేస్తే మంచిది అని నమ్రత తన ఇంస్టాగ్రామ్ లో పేర్కొంది.

 నెటిజన్ల నుంచి ప్రశంసలు

నెటిజన్ల నుంచి ప్రశంసలు

నమ్రత పెట్టిన పోస్ట్ కు నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రజలని చైతన్యపరిచే విషయం తెలియజేసారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సదరు సంస్థ ఆ డెలివరీ బాయ్ ని గుర్తించి వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X