twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బీజేపీలో చేరిన డిస్కో డ్యాన్సర్.. ప్రధాని మోదీతో మిథున్ చక్రవర్తి కలిసి..

    |

    దేశంలో సినీ తారలు రాజకీయాల్లోకి ప్రవేశించడం కొత్తేమీ కాదు. గతంలో ఎంతో మంది పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టారు. అమితాబ్, కృష్ణ, కృష్ణంరాజు, జమున, చిరంజీవి, కమల్ హాసన్ లాంటి రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజా సేవ చేసేందుకు ప్రయత్నించారు. తాజాగా వారి అడుగు జాడల్లోనే అలనాటి మిథున్ రాజకీయాల్లోకి రావడం సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

    అసెంబ్లీ ఎన్నికల వేళ మిథున్

    అసెంబ్లీ ఎన్నికల వేళ మిథున్

    సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి మార్చి 7వ తేదీన బీజేపీలో చేరారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో మిథున్ చేరిక ఆసక్తికరమైన అంశంగా మారింది. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్‌లో జరిగే ప్రధాని మోదీ మెగా ర్యాలీకి ముందు మిథున్ బిజేపీ‌లో చేరడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    బీజేపీ అధిష్టానం చొరవతో

    బీజేపీ అధిష్టానం చొరవతో

    శనివారం సాయంత్రం మిథన్ చక్రవర్తి నివాసంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బెంగాల్ రాజకీయ పరిశీలకుడు ప్రత్యక్షం కావడంతో చర్చనీయాంశమైంది. దాంతో మిథున్ చేరిక ఖాయమైందనే వాదన రాజకీయ వర్గాల్లో మొదలైంది. మిథన్ చేరికతో రాజకీయంగా సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    మాజీ రాజ్యసభ ఎంపీగా

    మాజీ రాజ్యసభ ఎంపీగా

    ఇక మిథున్ చక్రవర్తి విషయానికి వస్తే.. గతంలో రాజ్యసభ సభ్యుడిగా రెండేళ్లపాటు కొనసాగారు. అయితే సీఎం మమతా బెనర్జీతో ప్రభుత్వానికి అండగా నిలిచారు. కానీ రెండేళ్ల తర్వాత ఆనారోగ్యం కారణంగా ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు మమతా పార్టీకి వ్యతిరేకంగా బరిలో దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది.

     మిథన్ చక్రవర్తి కెరీర్

    మిథన్ చక్రవర్తి కెరీర్

    మిథన్ చక్రవర్తి కెరీర్ విషయానికి వస్తే.. 1972లో మృణాళ్ సేన్ దర్శకత్వంలో వచ్చిన మృగయా చిత్రం ద్వారా హీరోగా మారారు. హీరోగా పలు చిత్రాల్లో నటించిన ఆయన ఓ సమయంలో ప్రభంజనం సృష్టించారు. 1982లో రిలీజైన డిస్కో డ్యాన్సర్ చిత్రంతో స్టార్ హీరోగా మారిపోయాడు. బాక్సర్, డ్యాన్స్ డ్యాన్స్ చిత్రాల ద్వారా అద్బుతమైన పాపులారిటీ సంపాదించారు. తెలుగులో పవన్ కల్యాణ్ నటించిన గోపాల గోపాలా చిత్రంలో స్వామిజీ పాత్రతో ఆకట్టుకొన్నారు.

    English summary
    Super star Mithun Chakraborty joins BJP. Earlier he served as Rajya Sabha MP from TMC of Mamata Benerjee. After resign of MP Post. Now he Joined in BJP and he was to share dias with PM Narendra Modi in mega rally.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X