సూర్య యాక్టింగ్‌పై నాకు అనుమానాలు.. కార్తీ నటన అద్భుతం.. షాకిచ్చిన రజనీ

దక్షిణాది చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న తమిళ సినిమా 'కప్పాన్'. తెలుగులో ఈ సినిమా 'బందోబస్త్'గా ప్రేక్షకుల ముందుకొస్తుంది. సూర్యతోపాటు ప్రముఖ నటుడు మోహన్ లాల్, తమిళ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషా సైగల్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీస్ జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్ర పాట‌ల‌ను ఆదివారం చెన్నైలో విడుద‌ల చేశారు. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ముఖ్య అతిథిగా హాజ‌రై ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా హీరో సూర్యను రజనీకాంత్ ప్రశంసలతో ముంచెత్తారు. ఇంతకు రజనీ ఏమన్నారంటే..

 ప్రతీ సినిమాకు డిఫరెంట్‌గా

ప్రతీ సినిమాకు డిఫరెంట్‌గా

ప్రతి సినిమాకు స్టయిల్‌ను మార్చే హీరోల్లో సూర్య ఒకరు. ప్రతిసారీ కొత్తగా కనిపించాలని, ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాలు అందించాలని ప్రయత్నిస్తారు. ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. 'సింగం' లాంటి పక్కా కమర్షియల్ సినిమాలు... 'గజినీ', 'సెవెన్త్ సెన్స్', '24' లాంటి డిఫరెంట్ సినిమాలు... 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' వంటి లవ్ స్టోరీలు చేయడం ఆయనకు మాత్రమే సాటి అని రజనీకాంత్ అన్నారు.

సూర్య, కార్తీ యాక్టింగ్ గురించి

సూర్య, కార్తీ యాక్టింగ్ గురించి

కార్తి తొలి సినిమా 'ప‌రుత్తి వీర‌న్‌' (మ‌ల్లిగాడు)లో అద్భుతంగా న‌టించాడు. కానీ సూర్య న‌టించిన తొలి సినిమా చూసి ఇత‌న‌కు న‌టించ‌డానికి రావడం లేదే అనుకున్నాను. కానీ ఆయ‌న త‌న‌ను తాను మ‌లుచుకుని ఈ స్థాయికి వ‌చ్చినిల‌బ‌డ్డారు. `శివపుత్రుడు`, 'సింగం', 'సింగం2స‌, `వీడొక్కడే`, 'గ‌జిని' వంటి ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆయ‌న త‌ప్ప మ‌రెవ‌రూ చేయ‌లేర‌నేంత గొప్ప‌గా న‌టించారు అని రజనీ పేర్కొన్నారు.

సూర్య అర్హత అదే అంటూ రజనీ

సూర్య అర్హత అదే అంటూ రజనీ

ఇటీవల సూర్య ఎడ్యుకేష‌న్ సిస్టంపై చేసిన వ్యాఖ్య‌ల‌ను కొంద‌రు త‌ప్పు ప‌ట్టారు. ఆయన‌కేం అర్హత ఉంద‌ని ప్ర‌శ్నించారు. కానీ.. అగ‌రం ఫౌండేష‌న్‌ను స్థాపించి ఎంద‌రికో విద్య‌ను అందిస్తున్న సూర్య అక్క‌డి పిల్ల‌లు పడే క‌ష్టాన్ని క‌ళ్లారా చూసుంటాడు. అందువ‌ల్లే త‌ను అలా స్పందించాడు. త‌న వ్యాఖ్య‌ల‌ను నేను స‌మ‌ర్ధిస్తున్నాను. త‌ను ఆ విష‌యంపై మాట్లాడ‌టానికి పూర్తిగా అర్హుడు. సూర్య ఇంకా `బందోబస్త్' వంటి సినిమాలే కాదు. ఎన్నో గొప్ప సినిమాలు చేసి ఇంకా ప్ర‌జాభిమానం పొందాలి. త‌ర్వాత ఆయ‌న అవ‌స‌రం త‌ప్ప‌కుండా ప్ర‌జ‌ల‌కు ఉంటుంద‌ని నేను భావిస్తున్నాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌న‌లు`` అన్నారు.

 కేవీ ఆనంద్, హ్యారీస్ జైరాజ్ గురించి

కేవీ ఆనంద్, హ్యారీస్ జైరాజ్ గురించి

శివాజీ సినిమాలో నాతో కె.వి.ఆనంద్‌గారు ప‌నిచేశారు. ఆ సినిమా నేను శంక‌ర్‌తో చేయ‌డానికి కార‌ణ‌మైన వ్య‌క్తుల్లో కె.వి.ఆనంద్‌గారు ఒక‌రు. ఆయ‌న‌కు క‌థ‌పై మంచి జ‌డ్జ్‌మెంట్ ఉంటుంది. ఆయ‌న‌తో నేను ఒక సినిమా చేయాల్సింది. కానీ.. కొన్ని ప‌రిస్థితుల్లో అది కుద‌ర‌లేదు. ఇక మోహ‌న్‌లాల్‌గారు ఈ సినిమాలో మంచి పాత్ర‌లో న‌టించారు. ఆయ‌న గొప్ప న‌టుడే కాదు.. గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తి. అలాగే ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించిన ఆర్య‌.. న‌ట‌న‌ను 'నేను దేవుణ్ణి' సినిమాలో చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. అంత గొప్ప‌గా న‌టించారు. ఇక హేరీశ్ జైరాజ్‌గారు.. మ్యూజిక్ చాలా బావుంది. ఆయ‌న సంగీతం అందించిన సినిమాల్లో 'చెలి'లోని మ‌నోహ‌రా... సాంగ్ నాకు బాగా ఇష్ట‌మైన సాంగ్‌ అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X