అమెరికా వెళ్ళబోతున్న సూపర్ స్టార్, ఎందుకో తెలుసా?
సూపర్ స్టార్ రజనీకాంత్ రెండు వారాలపాటు అమెరికా వెల్లబోతున్నాడు. రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం రజిని అమెరికా వెల్లబోతుండడం విశేషం. రజనీ ప్రతి సంవత్సరం మెడికల్ చెకప్ కోసం అమెరికా వెళ్తారన్న విషయం తెలిసిందే. అదే విధంగా ఈసారి అమెరికా వెల్లబోతున్నాడు. ఇందులో కంగారు పడాల్సింది లేదు.
గత కొంత కాలం క్రితం రజినీకాంత్ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అభిమానులు ఆయన ఎందుకు వెళ్ళారో అని అనుకున్నారు, కాని నిజం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఈసారి సుమారు 2 వారాల పాటు ఈ చెకప్ ఉండనుందని సమాచారం.

రజినీకాంత్ తాజాగా నటించిన సినిమా కాలా, పా.రంజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా జూన్ 7న విడుదలకానుండగా శంకర్ తో చేసిన '2 పాయింట్ 0' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ రెండూ కాకుండా యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తో సినిమా ఉంటుందని రజినీకాంత్ అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











