RajiniKanth 170 లుక్ రిలీజ్... 72 ఏళ్ల వయసులోనూ ఆ బాడీ ఏంది మావా?
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే జైలర్ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు రజినీ. ఇప్పుడు ఆయన తాజాగా టి.జి. జ్ఞానవేల్ దర్శకత్వంలో తన 170 సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా పూజ కార్యక్రమాలను జరుపుకుంది. దానితో పాటు ఆ సినిమా షూట్ సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. ఇక ఆ ఫోటోల్లో రజినీ లుక్ ఓ రేంజ్ లో ఉంది. ఇక ఆ వివరాల్లోకి వెళితే...
తలైవర్ రజినీ కాంత్ సినిమా అంటే ఫ్యాన్స్ కు పండగే. ఇక ఆయన ఒక్కసారి స్క్రీన్ పై కనిపిస్తే... చాలు ఫ్యాన్స్ ఊగిపోతారు. ఇక ఇప్పటికే ఆయన జైలర్ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కళానిధి మారన్ సన్ పిక్చర్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక అనిరుధ్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. దాదాపు 600కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

ఇక జైలర్ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత రజినీ కాంత్ టి.జి. జ్ఞానవేల్ దర్శకత్వంలో తన 170 సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే స్టార్ నటినటులు నటిస్తున్నారు. 'తలైవా 170' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

ఇక 'తలైవా 170' నుంచి కొన్ని ఆసక్తికర ఫోటోస్ రిలీజ్ అయ్యాయి. అవి చూస్తుంటే.. రజినీకాంత్ షూటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 72 ఏళ్ల వయసులో కూడా రజినీకాంత్ ఫుల్ ఫిట్ గా ఉన్నారు. ఆయన సిక్స్ ప్యాక్ బాడీతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక లుక్ చూసి నెటిజన్స్... ఈ ఏజ్ లో కూడా ఇంత ఫిట్ గా ఎలా ఉన్నార్రా బాబు అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ ఫోటోస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

ఇక 'తలైవా 170' సినిమా విషయానికి వస్తే... టి.జి. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఇప్పటికే ఇందులో స్టార్ నటినటులు నటించనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో మంజూ వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ ముగ్గరు హీరోయిన్స్ నటిస్తున్నారు. వారితో పాటు... బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, మలయాళం నుంచి ఫహాద్ ఫాజిల్, టాలీవుడ్ నుంచి రానా దగ్గుబాటి కూడా ఈ చిత్రంలో నటించనున్నారు.

ఇక తలైవా 170 చిత్రానికి యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ మొన్ననే ప్రారంభం అయింది. దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఫోటోస్ వైరల్ గా మారాయి.


Click it and Unblock the Notifications











