2.0 టీజర్: దాన్ని ఎదిరించాలంటే మనకు ఒక సూపర్ పవర్ కావాలి.. చిట్టి ది రోబోట్!
సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ లతో శంకర్ సృష్టించిన అద్భుతం 2.0 చిత్రం. ఇండియన్ సినిమాలో ఎన్నడూ లేని విధంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. అద్భుతమైన విజువల్స్ తో ఓ అద్భుత ప్రపంచాన్ని శంకర్ మన కళ్ళ ముందు ఆవిష్కరించబోతున్నారు. ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2.0 చిత్ర టీజర్ కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు. టీజర్ లో విశేషాలు ఇప్పుడు చూద్దాం.

సెల్ ఫోన్లు హఠాత్తుగా
దేశంలోని అన్ని సెల్ ఫోన్లు హఠాత్తుగా మాయమై పోతుంటాయి. ఎదో అదృశ్య శక్తి మొబైల్ ఫోన్స్ ని ఆకాశంలోకి లాగేసుకుంటుంది. మీడియాలో ఇది సంచలనంగా మారుతుంది. పోలీసులు తలలు పట్టుకుంటుంటారు. ఎం జరుగుతుందో ఎవరికీ అత్త కాదు.

వింత ఆకారంలో
హఠాత్తుగా ఓ వ్యక్తి నిద్రలోనుంచి మేలుకుంటాడు. అతడు ఉన్న పరిసరాలు మొత్తం సెల్ ఫాన్స్ మయంగా మారిపోయి ఉంటాయి. అప్పుడే వింత ఆకారంలో అక్షయ్ కుమార్ ఎంట్రీ ఇస్తాడు.
సూపర్ పవర్ కావాలి
అప్పుడే శాస్త్రవేత్తగా ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రముఖులతో సమావేశం అవుతాడు. ఇది సైన్సుకు అతీతమైనది. దాన్ని ఎదిరించాలంటే మనకు సూపర్ పవర్ కావాలి. అయితే ఇప్పుడు ఎం చేద్దాం అంటారు అని మరో వ్యక్తి అంటాడు. చిట్టి ది రోబోట్ అని రజనీ సమాధానం ఇస్తాడు.

చిట్టి ది రోబోట్
రజని చిట్టి గురించి చెప్పగానే రోబో చిత్రంలో పార్ట్స్ మొత్తం విప్పేసి మ్యూజియంలో ఉంచిన చిట్టిని చూపిస్తారు. తిరిగి చిట్టి రోబోగా ఎంట్రీ ఇస్తాడు.

అమీ జాక్సన్ సస్పెన్స్
రజనీకాంత్, అక్షయ్ కుమార్ పాత్రలు టీజర్ లో చూపించిన శంకర్.. తెలివిగా అమీజాక్సన్ పాత్రని సస్పెన్స్ లోకి నెట్టాడు. మ్యూజియంలో చిట్టితో పాటు అమీజాక్సన్ కూడా కనిపిస్తోంది. అంటే అమీజాక్సన్ కూడా రోబోగా కనిపించబోతోందేమో.

విజువల్స్ ఒకరేంజ్‌లో
2.0 చిత్రంలో విజువల్స్, గ్రాఫిక్స్ ఎలా ఉండబోతున్నాయి టీజర్ ద్వారా శంకర్ శాంపిల్ చూపించాడు. వింత ఆకారాలలో కనిపిస్తూ అక్షయ్ కుమార్ మానవాళిని విధ్వంసం చేస్తుంటే దానిని అడ్డుకునే రోబో చిట్టిగా సూపర్ స్టార్ రజని కనిపిస్తన్నారు.

ఉత్కంఠ
రోబో చిత్రంలో మనం చిట్టిని చూసాం కాబట్టి ఆ పాత్ర గురించి అవగాహన ఉంది. కానీ అక్షయ్ కుమార్ విలన్ పాత్ర విశేషాలు ఏంటి, అమీ జాక్సన్ పాత్ర గుట్టు ఏమిటి అనే విశేషాలు తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











