'పేట' ప్రీమియర్ షో టాక్: రజని, విజయ్ సేతుపతి కేక పెట్టించేలా .. దిమ్మతిరిగే ట్విస్ట్!

Recommended Video

Petta Movie Premier Show Talk పెట్ట సినిమా ప్రీమియర్ షో టాక్ | Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యారు. రజని ఫ్యాన్స్ కోలాహలం మధ్య పేట మొదటి షోలు పడుతున్నాయి. పేట ట్రైలర్ చూశాక దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ 90దశకం నాటి రజనీని చూపించబోతున్నాడని అర్థం అయింది. విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ప్రీమియర్ షోలలో పేట చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం.

అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్

అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్

విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజ్.. పేట చిత్రంతో ఆశ్చర్యపరిచాడు. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ తో మాస్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాన్ని డీల్ చేయడంలో సత్తా చాటాడు. భాష తరహాలో అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ తో పేట కథని రాసుకున్నారు. ఈ చిత్ర కథకు తగ్గట్లుగా నటీనటుల్ని ఎంపిక చేసుకున్నారు.

ఆకట్టుకుంటున్న బ్యాగ్రౌండ్ మ్యూజిక్

ఆకట్టుకుంటున్న బ్యాగ్రౌండ్ మ్యూజిక్

కార్తీక్ సుబ్బరాజ్ దర్శత్వం, సినిమాటోగ్రఫీ, రజనీకాంత్ పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో హైలైట్ గా చెప్పుకోదగ్గ అంశాలు. ఇవి కాకుండా ఈ చిత్రాన్ని మరో స్థాయికి చేర్చిన అంశాలు కొన్ని ఉన్నాయి. కీలక పాత్రలో నటించిన విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దిఖీ తమ నటనతో పేట చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చారు. అనిరుద్ రవిచందర్ రజని ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే సంగీతం అందించాడు. ముఖ్యంగా మరణ మాస్ సాంగ్ విజిల్స్ కొట్టించే విధంగా ఉంది. బ్యాగ్రౌండ్ సంగీతం రజని పాత్రని ఎలివేట్ చేసే విధంగా ఉంది.

క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా

క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా

ఇక పేట చిత్రాన్ని చూసిన ప్రతి అభిమాని క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ మతిపోగోట్టే ట్విస్ట్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసినట్లు తెలుస్తోంది. రజీని కాంత్ రెండు గెటప్స్ లోని ఆంతర్యం ఏంటి, ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది అనే అంశాలు సినిమా చూసే తెలుసుకోవాలి. కార్తీక్ సుబ్బరాజ్ ఓవైపు రజని మార్క్ పంచ్ డైలాగులతో ఆకట్టుకుంటూనే ఉత్కంఠ భరితంగా కథని నడిపించారు.

రజని అభిమానులకు మాత్రమే కాదు

రజని అభిమానులకు మాత్రమే కాదు

ఇటీవల 2.0 చిత్రాన్ని మినహాయిస్తే రజని ఫాన్స్ ని ఆకట్టుకునే కాలా, కబాలి లాంటి చిత్రాలు చేస్తూ వచ్చారు. కానీ పేట చిత్రం రజని అభిమానులని మాత్రమే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉందంటూ ప్రీమియర్ షోల నుంచి రెస్పాన్స్ వస్తోంది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం రాబోవు రోజుల్లో ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X