ఆయన సీఎం అవుతాడా? అదే అద్భుతం.. మా భవిష్యత్ ఏంటో.. రజనీ సెన్సేషనల్ కామెంట్స్

తమిళ రాజకీయాల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ తన మార్కు చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు పొలిటికల్‌‌గా విమర్శలు పెద్దగా చేయని తలైవా ప్రభుత్వాలపై తన విమర్శలకు పదును పెడుతున్నట్టు కనిపిస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన విమర్శలే అందుకు సాక్ష్యంగా నిలిచాయి. రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటన చేసిన తర్వాత రజనీకాంత్ తొలిసారి అధికార పన్నీరు సెల్వం ప్రభుత్వంపై సెటైర్లు వదిలాడు. తాజాగా రజనీకాంత్ చేసిన విమర్శలు దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇంతకు రజనీకాంత్ ఏమన్నారంటే..

కమల్ హాసన్‌ 60 ఏళ్ల వేడుకలో

కమల్ హాసన్‌ 60 ఏళ్ల వేడుకలో

ప్రముఖ నటుడు కమల్ హాసన్ సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి 60 ఏళ్లు పూర్తయాయి. ఈ సందర్భంగా ఉంగల్ నాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు సూపర్‌స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన చిరకాల మిత్రుడు కమల్ హాసన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పళనిస్వామిపై సెటర్లతోపాటు కమల్‌ హాసన్‌పై ప్రశంసలు కురిపించారు.

 దారులు వేరైనా మా స్నేహబంధం

దారులు వేరైనా మా స్నేహబంధం

కమల్ హాసన్ నాకు అత్యంత ఆప్తుడు. రాజకీయంగా మా దారులు, అభిప్రాయాలు, సిద్ధాంతాలు వేరైనా మా మధ్య స్నేహం బలంగా ఉంటుంది. ఇద్దరి అభిమానులు కూడా ఇదే ఫాలో అవుతుంటారు. మా భవిష్యత్ ఏమిటో మాకు తెలియదు కానీ.. మా గతం, మా స్నేహబంధం అపూర్వమైనది అని రజనీకాంత్ ఉద్వేగానికి లోనయ్యారు.

 తమిళ సీఎంపై సెటైర్లు

తమిళ సీఎంపై సెటైర్లు

తమిళనాడులో అద్భుతం జరిగిన కారణంగానే మనం చూడకూడని పరిస్థితులను చూస్తున్నాం. ఇంకా అలాంటి అద్భుతాలే కొనసాగుతున్నాయి. రెండేళ్ల క్రితం ఇడప్పాడి కే పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరైనా ఊహించారా. రాజకీయాల్లో చోటు చేసుకొన్న సంఘటనను అద్భుతం కాకుండా మరేమైనా అంటామా అని రజనీకాంత్ తన మార్కు డైలాగ్స్‌తో కేకపెట్టించాడు. సుతిమెత్తగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Recommended Video

#CineBox : Sarileru Nekevvaru Teaser Update | Aamir Khan's Lal Singh Chadha First look
 అదృష్టం కలిసి వస్తే..

అదృష్టం కలిసి వస్తే..

ఈకే పళనిస్వామి గద్దెనెక్కినప్పుడు రెండు వారాల కంటే ఎక్కువ ఉండడని అందరూ అనుకొన్నారు. కానీ రెండేళ్లు అవుతున్నా ఇంకా అధికారాన్ని సూపర్బ్‌గా అనుభవిస్తున్నాడు. అదృష్టం ఉంటే ఈ అద్భుతం నిన్న జరిగింది.. ఈ రోజు జరుగుతున్నది.. రేపు కూడా కొనసాగుతుంది అని రజనీకాంత్ అన్నారు. దాంతో ఈ సమావేశం నవ్వులతో మునిగిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X