ఆ నైట్ కు..రజనీకాంత్ కూడా
వరదబాధితులను ఆదుకొనే నిమిత్తం తెలుగు చిత్ర పరిశ్రమ 'స్పందన' పేరుతో నవంబరు 7న స్టార్‌నైట్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్న సంగతి విదితమే.ఈ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న డా.దాసరి నారాయణరావు మాట్లాడుతూ-"ఈ స్టార్‌నైట్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకోసం అన్ని శాఖలను సమన్వయపరిచి 18 కమిటీలను కూడా వేశాం. ఈ స్టార్‌నైట్‌లో తెలుగు సినీ రంగానికి చెందిన అందరు కథానాయకులు, 22 మంది నాయికలు, కేరక్టర్ ఆర్టిస్ట్‌లు, కమెడియన్స్ పాల్గొంటారు. సంగీత దర్శకుల విభావరి కూడా వుంటుంది.
ఇప్పటి వరకు ఎక్కడా చేయని కామెడీ షోలు కూడా వుంటాయి. తమిళనాడుకు చెందిన స్టార్ హీరోలు రజనీకాంత్, విజయ్, శరత్‌కుమార్, సూర్య కూడా ఈ వేడుకలో పాలుపంచుకోనున్నారు. విదేశాల్లో వున్న కమల్‌హాసన్ కూడా రావడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అలాగే హిందీ నటులు జితేంద్ర, రాజేష్‌ఖన్నా హాజరవుతున్నారు. అమితాబచ్చన్ కూడా వచ్చే అవకాశముంది' అన్నారు.
ఈ వేడుకకు టిక్కెట్ వెల, ఇతర వివరాలు త్వరలోనే తెలియజేస్తామని కమిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, నందమూరి బాలకృష్ణ చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో నటీనటుల సంఘం అధ్యక్షుడు మురళీమోహన్ , వెంకటేష్, రాజశేఖర్, నాగబాబు, జగపతిబాబు, ప్రియమణి, పూనమ్‌కౌర్, హంసానందిని, అర్చన, బ్రహ్మాజి, దాసరి అరుణ్‌కుమార్, జీవిత, ఏవీఎస్, మాదాల రవి, పరుచూరి గోపాలకృష్ణ, కళ్యాణ్‌రామ్, తారకరత్న, కాదంబరి కిరణ్ తదితరులు కూడా పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











