»   » నేడు రజనీకాంత్ బర్త్ డే, ఎక్కడా కనిపించని సంబరాలు!

నేడు రజనీకాంత్ బర్త్ డే, ఎక్కడా కనిపించని సంబరాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కృషి ఉండే మనుషులు అతి సామాన్యుడు కూడా సూపర్ స్టార్ అవుతాడు అనడానికి రజనీకాంత్‌ను మించిన ఉదాహరణ ఉండదేమో! నేడు రజనీకాంత్ పుట్టినరోజు. ఆయన 64 సంవత్సరాలు పూర్తి చేసుకుని 65వ వడిలోకి అడుగిడుతున్న సందర్భంగా రజనీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ...ఆయన గురించి విషయాలు కొన్ని గుర్తు చేసుకుందాం.

రజనీ కాంత్ 1950 డిసెంబర్ 12న బెంగుళూరులో శివాజీ రావు గైక్వాడ్ గా జన్మించారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరకముందు లేబర్ గా, బస్ కండక్టర్ గా కూడా పనిచేసారు. అతనిలోని స్టైల్ ని క్యాచ్ చేసిన కె. బాలచందర్ తను 1975లో తీసిన ‘అపూర్వ రాగన్గల్' సినిమాలో అవకాశం ఇచ్చారు.

తొలి సినిమాలో ఆయనకు పెద్దగా గుర్తింపు రాలేదు. తర్వత కన్నడలో పుట్టన్న కన్నంగళ్ దర్శకత్వంలో చేసిన కథా సంగమం చిత్రంలో హీరోగా చేసినా అవకాశాలు రాలేదు. మరోసారి బాలచందర్ నుండి రజనీకాంత్ కు పిలుపు వచ్చిన తర్వాత రజనీకాంత్ జీవితం మారిపోయింది. తమిళంలో అవర్ ఒరు తోడర్ కథై, తెలుగులో అంతులేని కథ పేర్లతో వచ్చిన చిత్రాలతో రజనీకాంత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 1980ల్లో టాప్ తమిళ్ స్టార్ గా ఎదిగారు, 1990 లో ఎన్నో కమర్షియల్ హిట్స్ అందించారు. ‘దళపతి', ‘భాషా', ‘ముత్తు', ‘అరుణాచలం', ‘అంతులేని కథ', ‘నరసింహా', ‘చంద్రముఖి', ‘శివాజీ', ‘రోబో' మొదలైన సినిమాలు ఆయన కెరీర్లో చెప్పుకోదగ్గ కొన్ని సినిమాలు.

Super star Rajinikanth Turns 65

రజినీకాంత్ కు తెలుగు, తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషస్తులే కాదు, జపాన్, సింగపూర్ లో కూడా ఫాన్స్ ఉన్నారు. ఎంతో స్టార్ డం ఉన్నప్పటికీ రజనీకాంత్ చాలా సింపుల్ గా లైఫ్ డీల్ చేస్తారు. ప్రతి ఏడాది రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు అభిమానులు గనంగా జరుపుకునే వారు. కానీ ఈ ఏడాది మాత్రం ఎలాంటి సెలబ్రేషన్స్ లేవు.

రజనీ సెలబ్రేట్ చేసుకునే మూడ్‌లో లేరు. అసలే రజనీకి సెలబ్రేషన్స్ అంటే ఇష్టం ఉండదు. కుటుంబ సభ్యులు, అభిమానుల కోరికను కాదనలేక నిరాడంబరంగా చేసుకుంటారు. అయితే, ఈసారి అది కూడా వద్దనుకుంటున్నారట. భారీ వర్షాల కారణంగా తమిళనాడు ప్రజల పరిస్థితి దయనీయంగా ఉన్న నేపథ్యంలో పుట్టినరోజు జరుపుకోకూడదని రజనీ నిర్ణయించుకున్నారట.

English summary
Superstar Rajinikanth who is the heart of Tamil cinema turned 65 today.
Please Wait while comments are loading...