నాగ్‌సూపర్ టైటిల్‌కు చిరంజీవి ప్రశంస
నాగార్జునతాజా చిత్రం సూపర్ టైటిల్ బాగుందనిచిరంజీవి ప్రశంసించినట్టు ఒక సినిమా వార పత్రిక పేర్కొంది.వరుసగా ఐదు సినిమాలు హిట్ అయిడబుల్ హ్యాట్రిక్‌కు చేరువలో ఉన్న నాగార్జునతోచిరంజీవికి ప్రగాఢ స్నేహంఉంది. మాస్ చిత్రం ప్రారంభమైనప్పుడుచిరంజీవి కొట్టాలి నాగ్ అన్నారు. ఆ సినిమా చూసినతర్వాత కొట్టావు నాగ్ అన్నారు.ఇప్పుడీ సినిమా టైటిల్ సూపర్ సూపర్‌గా ఉందని ఆయనప్రశంసించడం విశేషం. సినిమా కథతో ఈ టైటిల్‌కు సంబంధంలేదని, సినిమాలో అన్న సీన్లు సూపర్‌గావచ్చాయి కాబట్టి ఆ టైటిల్ పెట్టామని దర్శకుడు పూరీ జగన్నాధ్ తెలిపారు.ఇది హాలివుడ్ తరహా స్లీక్ చిత్రమనిఆయన అన్నారు. ఇది అన్ని వర్గాలనుఆకర్షించే సినిమా అని, చిన్న పిల్లలైతే సినిమాను రెండు మూడు సార్లు చూస్తారని ఆయనచెప్పారు. మేకింగ్‌పరంగా తెలుగు సినిమా స్ధాయిని పెంచేచిత్రమని ఆయన అన్నారు.ఒకొక్కటి పదిలక్షల రూపాయల ఖరీదు చేసే 30 బైక్‌లనుబైక్ ఫైట్స్ కోసం ఉపయోగించినట్టు పూరీ చెప్పారు.


Click it and Unblock the Notifications











