పాకిస్థాన్ లోనూ బాహుబలి హౌస్ ఫుల్ : ఫొటో పెట్టిన ఉమైర్ సంధూ

పాక్ లో బాహుబలి పార్ట్ టూ విడుదల అయ్యింది. అక్కడ సినిమా రూ.6 కోట్ల వరకూ వసూళ్లు దక్కించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మాగ్నమ్ ఓపస్ ఫిల్మ్ 'బాహుబలి-2' విడుదలై అన్ని చోట్ల కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో 10 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది.'బాహుబలి-2' మూవీ ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది. రూ. 1000 కోట్ల మార్కును అందుకుని సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. సినిమా విడుదలైన 9వ రోజే బాహుబలి-2 ఈ రికార్డును అందుకోవడం విశేషం.

పాక్ లో నిషేధం తొలగింది

పాక్ లో నిషేధం తొలగింది

తెలుగునాట, ఇండియా అంతటా.. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న బాహుబలి - ది కంక్లూజన్ పాకిస్తాన్ లోనూ ఇంతే స్థాయి ఆదరణను పొందుతుండటం గమనార్హం. భారతీయ సినిమాల విడుదలపై ఇటీవలే పాక్ లో నిషేధం తొలగింది. ఈ నేపథ్యంలో బాహుబలి పార్ట్ టూ అక్కడా విడుదల అయ్యింది.

పాకిస్థాన్ తో సహా

పాకిస్థాన్ తో సహా

దాదాపు వంద స్క్రీన్లపై ఈ సినిమా రిలీజ్ అయినట్టుగా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు.మన తెలుగు దర్శకుడు తీసిన బాహుబలిపై పాకిస్థాన్ తో సహా.. ప్రపంచ దేశాలన్నింటిలో అభిమానం వ్యక్తమవుతుండడం.. నిజంగా దేశానికి గర్వకారణమని.. అంతా అప్రిషియేట్ చేస్తున్నారు దర్శకధీరుడిని.

బాలీవుడ్

బాలీవుడ్

అసలు పాకిస్థాన్ తో భారత్ కి ఎప్పుడు పడదు కాని బాహుబలి సినిమాతో అక్కడ భారత్ పై గౌరవం పెరిగినట్లు తెలుస్తుందని సినీవర్గాలు మాట్లాడుకుంటున్నారు. నిజానికి పాక్ లో మన బాలీవుడ్ సినిమాలకి ఉన్న ఆదరణ తక్కువేం కాదు. ఒకదశలో అయితే అసలు బాలీవుడ్ వల్ల లాలీవుడ్ (పాక్ సినీ ఇండస్ట్రీ) నష్టాల్లో కూరుకు పోతుందనే ఆందోళన కూడా మొదలయ్యింది.

పాక్ లో మాహిష్మతీ సామ్రాజ్యం

పాక్ లో మాహిష్మతీ సామ్రాజ్యం

అలాంటి సందర్భం లో ఒక భారతీయ జానపద గాథ, అదీ పాక్ లో హిందూ కథలన్నా, హిందూ సాంప్రదాయాలన్నా పెద్ద వ్యతిరేకత ఉంటుందన్న అపోహ ఉన్న సమయం లో. బాహుబలి ఆ అంచనాలన్నీ తారు మారు చేస్తూ పాక్ లో మాహిష్మతీ సామ్రాజ్యాన్ని నిలబెట్టింది.

హౌస్ ఫుల్ కలెక్షన్లతో

హౌస్ ఫుల్ కలెక్షన్లతో

పాక్ సినీ అభిమానులు థియేటర్ల వద్ద క్యూలు కట్టేస్తున్నారని అక్కడ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వర్గాలు చెబుతున్నాయి. సినిమా థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో కళకళలాడిపోతున్నాయని డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు. వాస్తవంగా పాకిస్థాన్‌లో భారత సినిమాలకు సెన్సార్ కట్లు ఎక్కువగా పడుతుంటాయని, కానీ, బాహుబలి-2 విషయంలో మాత్రం పాక్ సెన్సార్ బోర్డు మినహాయింపునిచ్చిందని, కనీసం ఒక్క కట్ కూడా లేకుండా అక్కడ సినిమాకు ‘యూ' సర్టిఫికెట్‌ను ఇచ్చారని అంటున్నారు.

6 కోట్ల వరకూ వసూళ్లు

6 కోట్ల వరకూ వసూళ్లు

అక్కడ సినిమా రూ.6 కోట్ల వరకూ వసూళ్లు దక్కించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ స్థాయి వసూళ్లు వస్తే మాత్రం సినిమా సూపర్ హిట్టేనని అంటున్నారు. ఇక, ఆ సినిమాపై అక్కడ ఎంతలా క్రేజ్ పెరిగిపోయిందంటే.. టీవీ చానెళ్లలోనూ ప్రముఖ నటీనటులతో ‘బాహుబలి డిబేట్లు' నిర్వహిస్తున్నారు. అక్కడ థియేటర్ల వద్ద రషెస్‌ను సినిమా ఉమైర్ సంధూ.. ట్విట్టర్‌లో ఫొటోల ద్వారా తెలియజేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X